For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉన్ముక్త్ చంద్‌కు తీవ్రగాయం.. చావుతప్పి కన్ను లోట్టబోయింది!

EX India U-19 captain Unmukt Chand suffers gruesome eye injury

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎక్కడ.. ఎలా తాకిందో తెలియదు కానీ.. అతని కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని అతనే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కంటి గాయానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ ఫొటోలో అతని ఎడమ కన్ను కనిపించకుండా పూర్తిగా ఉబ్బిపోయి మూసుకుపోయింది. బంతి బలంగా అతని ఎడమ కన్నును తాకినట్లు అర్థమవుతోంది. అథ్లెట్ జీవితం సాఫీగా సాగిపోదనడానికి తన గాయమే ఓ నిదర్శనమని ఉన్ముక్త్ పేర్కొన్నాడు.

జస్ట్ మిస్.. కన్ను పోయేది..

'అథ్లెట్ అంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. కొన్ని సార్లు మనం విజయాలతో తిరిగి వస్తాం. మరికొన్ని రోజులు నిరాశగా, ఓటమి భారంతో పాటు గాయాలను ఇంటికి మోసుకురావాల్సి ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి... తృటిలో కన్ను పోయేది... నన్ను విష్ చేసినవారందరికీ థ్యాంక్యూ.' అంటూ ఉన్ముక్త్ ట్వీట్ చేశాడు.

అండర్ 19 ప్రపంచకప్‌తో..

అండర్ 19 ప్రపంచకప్‌తో..

అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన ఉన్ముక్త్ చంద్ అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. 2012 అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమిండియా కెప్టెన్ అయిన ఉన్ముక్త్ చంద్, క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించడానికి ముందే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. చిన్న వయసులోనే విపరీతమైన డబ్బును చూసిన ఉన్ముక్త్‌కు మెళ్లి మెళ్లిగా ఆటపై శ్రద్ద తగ్గిపోయింది. దాంతో ఐపీఎల్‌లో విఫలమైన అతను.. పూర్తిగా భారత క్రికెట్‌నే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 అమెరికా క్రికెటర్‌గా..

అమెరికా క్రికెటర్‌గా..

టీమిండియా తరుపున దేశవాళీ క్రికెట్‌లో 67 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 120 లిస్టు ఏ మ్యాచులు ఆడిన ఉన్ముక్త్ చంద్, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. 2016 తర్వాత ఉన్ముక్త్ చంద్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. దాంతో 2021 ఆగస్టులో అన్ని రకాల భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్, అమెరికాకు మకాం మార్చాడు. కోరే అండర్సన్, లియామ్ ప్లంకెట్, జుయాన్ థెరాన్, సమీ అస్లాం వంటి ఆటగాళ్లతో కలిసి యూఎస్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత్ వేదికగా జరగనున్న 2023 ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ఉన్ముక్త్ సిద్దమవుతున్నాడు. భారత్‌ నుంచి బీబీఎల్ ఆడిన తొలి ఆటగాడిగా కూడా ఉన్ముక్త్ చంద్ రికార్డు నమోదు చేశాడు.

Story first published: Saturday, October 1, 2022, 20:55 [IST]
Other articles published on Oct 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+