టీమిండియా‌కు టెస్టుల కంటే ఐపీఎలే ముఖ్యం.. డబ్బులకు బీసీసీఐ దాసోహం: ఇంగ్లండ్ మాజీ పేసర్

లండన్: టీమిండియాకు టెస్ట్‌ల కంటే ఐపీఎలే ముఖ్యమని ఇంగ్లండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ ఆరోపించాడు. ఇది క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే టీమిండియా.. ఆ టోర్నీ కోసం ఏకంగా టెస్ట్ మ్యాచ్‌నే వాయిదా వేసుకుందని తెలిపాడు. గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో పర్యటించిన టీమిండియా.. చివరి మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగింది. ఆ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో పలువురు కరోనా బారిన పడటంతో ఇరు దేశాల బోర్డులు పరస్పర అంగీకారంతో ఆ టెస్ట్‌ను నిరవధికంగా వాయిదా వేసుకున్నాయి.

బీసీసీఐ మరీ గలీజ్..

బీసీసీఐ మరీ గలీజ్..

ఆ మ్యాచ్‌ను మళ్లీ ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించనున్నాయి. శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ తీరుపై పాల్ న్యూమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐకి అంతర్జాతీయ టెస్టు మ్యాచుల కంటే ఐపీఎలే ముఖ్యమని.. కోవిడ్ కారణంగా గతేడాది టెస్టు మ్యాచ్ ను రద్దు చేశామనడం హాస్యాస్పదమని తెలిపాడు. బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు క్రికెట్‌ మనుగడకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు. పైగా టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని కవరింగ్ ఇస్తుందని తెలిపాడు.

టెస్ట్ మనుగడకే ప్రమాదకరం..

టెస్ట్ మనుగడకే ప్రమాదకరం..

'టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వచ్చిన టీమిండియా గతేడాదే చివరి మ్యాచ్‌ను ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా ముగించాల్సింది. కానీ వాళ్లు ఆ మ్యాచ్ ను రద్దు చేయించుకుని స్టేడియానికి మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇక కోవిడ్ కారణంగా మ్యాచ్‌ను ర్దుదు చేశామని చెప్పడం హస్యాస్పదం. మరి ఆ తర్వాతైనా వాళ్లు ఐపీఎల్ వైపునకే మొగ్గు చూపారే తప్ప టెస్టు పూర్తి చేయలేదు. ఇలాంటి దృక్పథం ఉండటం ప్రమాదకరం...'అని యూకేకు చెందిన డైలీ మెయిల్‌కు రాసిన ఆర్టికల్‌లో పాల్ న్యూమన్ అభిప్రాయపడ్డాడు.

IPL 11 : Delhi Daredevils rope in Liam Plunkett to replace Rabada | Oneindia News
మైఖేల్ వాన్ సైతం..

మైఖేల్ వాన్ సైతం..

ఇదే విషయమై గతంలో ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. 'ఐపీఎల్ జట్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాయి. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ ఉంది. టోర్నీ ప్రారంభమయ్యేవరకు మరో 7 రోజుల సమయముంది. ఐపీఎల్ తప్ప మరే ఇతర కారణాల వల్ల ఈ టెస్టు రద్దైందని నాకు చెప్పకండి..'అని వార్న్ అప్పట్లో ట్వీట్ చేశాడు. గతేడాది చివరి మ్యాచ్‌ను వాయిదా వేసుకున్న టీమిండియా.. ఆ వెంటనే దుబాయ్ వెళ్లి అక్కడ ఐపీఎల్ తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఆడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 30, 2022, 15:37 [IST]
Other articles published on Jun 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X