అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు..!(వీడియో)
టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తనయుడు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆర్యన్.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెంది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన అతను.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును వివరిస్తూ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

నాకు నచ్చినట్లు మారిపోయా..
'శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం పూర్తిగా మారిపోయింది. నాలోని అసంతృప్తి కొద్ది కొద్దీగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక నుంచి నేను వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది.'అని అనయగా మారిన ఆర్యన్ ఆ వీడియోలో సంతోషం వ్యక్తం చేశాడు.
భారత దేశవాళీ క్రికెట్ ఆడిన ఆర్యన్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ జెండర్స్‌కు క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో క్రికెటర్ కావాలనే తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయగా మారిన ఆర్యన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
ట్రాన్స్‌జెండర్స్‌కు అవకాశం ఇవ్వాలి..
'నా ప్రేమ.. నా ఆశయం.. నా భవిష్యత్తు అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా కోచ్‌గానూ సేవలందించాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను క్రికెటర్ కావాలనుకున్నాను. అందుకు అనుగుణంగా నా నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేశాను. కానీ మధ్యలో ఇలా ఆటను వదిలేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు.
అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ జెండర్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.
నా శరీరం పూర్తిగా మారిపోయింది. నా మజిల్ పవర్ తగ్గింది. శక్తిని కూడా కోల్పోయాను. ట్రాన్స్‌వుమన్‌కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి.'అని అనయ అలియాస్ ఆర్యన్ భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు. గతేడాదే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, మహిళా క్రికెటర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
సంజయ్ పెద్ద కొడుకు ఆర్యన్..
మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ 2001 2004 మధ్య టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా వ్యవహరించాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజయ్ బంగర్.. ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు. భారత్ తరఫున 12 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడిన సంజయ్ బంగర్.. 470, 180 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో ఏడేసి వికెట్లు తీసాడు.
ఆటగాడి కంటే కోచ్‌గానే సంజయ్ బంగర్ ఎక్కువ గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి బ్యాటింగ్ కోచ్‌గా.. హెడ్ కోచ్‌గా సంజయ్ బంగర్ పనిచేశాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ సేవలందించాడు. 52 ఏళ్ల సంజయ్ బంగర్.. కశ్మీరను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్దవాడైన ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు.
Sanjay Bangar's son undergoes harmone replacement surgery.
— Amit T (@amittalwalkar) November 10, 2024
Aryan becomes Anaya!
Have a look at Ananya's instagram post!#Cricket #CricketTwitter #SanjayBangar pic.twitter.com/esePJjf4Ua
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications