ముంబై: టీమిండియా ఆల్ రౌండర్, స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడని రియాలిటీ షో బిగ్‌బాస్ 10లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆకాంక్ష శర్మ తెలిపింది. యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను పెళ్లాడి ఆ తర్వాత కొంతకాలానికి విడిపోయిన ఆమె బిగ్‌బాస్ షోలో యువీ తల్లిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
నిజానిజాలివిగో: యువరాజ్ తల్లి షబ్నంపై ఆరోపణలకు అయితే తాజాగా బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన ఆకాంక్ష శర్మ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను గంజాయి తాగేవాడినని యువరాజ్ సింగ్ స్వయంగా తనకు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చింది. యువీ తల్లి షబ్నం సింగ్ చేతిలో మీరు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని అడగ్గా...
"వారి ఇంట్లో వేధింపులు సహజంగానే ఉండేవి. ఇందులో భాగంగా నేను నా భర్తతో కలిసి గంజాయి తాగాల్సి వచ్చింది. యువీ కూడా తాను గంజాయి తాగేవాడినని నాకు చెప్పాడు. ఇది చాలా సాధారణమైన విషయం. ఈ విషయాలు నేను వెల్లడించడంతో మా అత్తయ్య తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు' అని ఆమె పేర్కొన్నారు.

కాగా, యువీ తల్లి షబ్నం సింగ్ తనను సరిగా చూడలేదని, ఆమె వల్లే తన పెళ్లి కేవలం నాలుగు నెలలకే విచ్ఛిన్నమైందని, దీంతో తన అత్తవారింటి నుంచి తిరిగొచ్చినట్టు ఆకాంక్ష శర్మ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దాని నుంచి కోలుకునేందుకు ఈ షోకు వచ్చానని కూడా ఆమె తెలిపింది.
సల్మాన్ షోలో యువరాజ్ తల్లిపై రెండో కోడలు తీవ్ర ఆరోపణలు తన అత్తగారి కుటుంబం నుంచి తాను ఏదీ కోరుకోవడం లేదని, తనకు విడాకులు ఇస్తే చాలని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆకాంక్ష శర్మ వ్యాఖ్యలపై యువీ తల్లి షబ్నంసింగ్ గతంలోనే స్పందించింది. ఆకాంక్ష చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చిన షబ్నం సింగ్ ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడనని గతంలో వివరణ ఇచ్చారు.