Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సల్మాన్ షోలో యువరాజ్ తల్లిపై రెండో కోడలు తీవ్ర ఆరోపణలు

ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్‌పై తన కొడుకు భార్య చేసిన ఆరోపణలను తొసిపుచ్చారు. ఆ వివాదం ఇంకా కోర్టులో ఉన్నందున దీనిపై తానేమీ మాట్లాడబోనని ఆమె స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే... సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా ఆదివారం రాత్రి ప్రసారమైన బిగ్‌బాస్‌ టీవీషోలో ఆకాంక్ష శర్మ పలు విషయాలను తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిబిగ్‌బాస్‌ సీజన్ 10 ప్రారంభం సందర్భంగా ఆకాంక్ష శర్మ (25) అనే యువతి తాను గతంలో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తమ్ముడు జోరావర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించారు. తమ పెళ్లి కేవలం నాలుగు నెలలకే విచ్ఛిన్నమైందని, దీంతో తన అత్తవారింటి నుంచి తిరిగొచ్చినట్టు తెలిపారు.

 Yuvraj Singh's mother

దీనికి కారణం యువరాజ్‌సింగ్‌ తల్లి, తన అత్త అయిన షబ్నంసింగ్‌యేనని ఆరోపించారు. ఆమె కారణంగానే తాను భర్త నుంచి విడిపోయినట్టు తెలిపారు. దాని నుంచి కోలుకునేందుకు ఈ షోకు వచ్చానని ఆమె తెలిపింది. తన అత్తగారి కుటుంబం నుంచి తాను ఏదీ కోరుకోవడం లేదని, తనకు విడాకులు ఇస్తే చాలని ఆమె వ్యాఖ్యానించింది.

ఆకాంక్ష శర్మ వ్యాఖ్యలపై యువీ తల్లి షబ్నంసింగ్‌ స్పందించారు. ఆమె పెళ్లి విషయం కోర్టు పరిధిలో ఉందని, కాబట్టి ఆ వివరాలు తాను వెల్లడించలేనని చెప్పారు. భర్తతో విడిపోయి రెండున్నరేళ్లు గడచిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆమె ఆరోపణలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

Akanksha

ఇది గతంలోనే ఆమె చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ఇప్పుడు వేదిక (బిగ్‌బాస్‌ షో) దొరికినందుకు ఆమె ఇవన్నీ విషయాలు చెప్తోంది' అని షబ్నం సింగ్‌ అన్నారు. వారి వైవాహిక బంధం విడిపోవడానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి వస్తుందని తనకు తెలుసునని ఆమె అన్నారు.

ఈ విషయంలో ఆకాంక్ష శర్మ తనను నిందించినా ఫర్వాలేదని, ఆమెకు ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+