సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే కావ్య మారన్‌ను చూసేందుకే మైదానాలకు వచ్చే అభిమానులు ఉన్నారు. సినీ హీరోయిన్ తలపించే ఆమె అందానికి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.
ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతాయి.

అందమే అసూయ పడేలా..:ఐపీఎల్ 2024 సీజన్ వేలంలోనూ కావ్య మారన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. కావాల్సిన ఆటగాడు దక్కినప్పుడు చిరు నవ్వులు చిందించారు. ఈ వేలంలో ఆమె ఇచ్చిన ప్రతీ ఎక్స్‌ప్రెషన్ నెట్టింట వైరల్‌గా మారింది.
అంతటి క్రేజ్ ఉన్న కావ్య పాప.. వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. ఐపీఎల్ సమయంలో తప్పా మళ్లీ ఆమె ఎప్పుడూ బాహ్య ప్రపంచానికి కనిపించదు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఒక్క అకౌంట్ కూడా లేదు. కేవలం ఐపీఎల్ సమయంలోనే దర్శనమిస్తూ ఉంటోంది.
బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు..:ఈ క్రమంలోనే ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక కావ్య మారన్ బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు.

బిజినెస్ మీద ఆసక్తితో కావ్య ఎంబీఏ చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంతో తన తండ్రి బిజినెస్‌ల్లోని సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ను చూసుకుంటుంది. త్వరలో సన్‌గ్రూప్‌ను టేకప్ చేయబోతుంది.
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్..:కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసియాలోనే నెంబవర్ వన్ టీవీ నెట్ వర్క్ సంస్థను స్థాపించారు. కావ్య వాళ్లది బిజినేస్ కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్, డీఎంకే పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్‌సభ ఎంపీ. తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య.
సన్‌గ్రూప్‌లో జెమీనీతో పాటు అనేక భాషల్లో చాలా చానెళ్లు ఉన్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినదే. రెడ్ ఎఫ్‌ఎంతో పాటు ఇండియా మొత్తం 70 రెడియా స్టేషన్లు ఉన్నాయి. రోబో, జైలర్ సినిమాలు నిర్మించిన సన్ పిక్ఛర్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే.
స్పైస్ జెట్‌లో కూడా 40 శాతం వాటా ఉండేది. కానీ ఆ వాటాను స్పైస్ జెట్ ఓనర్ అజయ్ సింఘ్‌కేఅమ్మేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్ వర్త్ 2023 ప్రకారం రూ. 19 వేల కోట్లు కాగా.. కావ్య మారన్ నెట్ వర్త్ రూ. 409 కోట్లుగా ఉంటుంది.