Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: శుభ్‌మన్ గిల్

మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అతను జట్టులో ఉండటం తమ అదృష్టమని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 339/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయ వియాజయాన్నందించాడు.

సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌‌లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్.. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. కెప్టెన్‌గా ఈ సిరీస్‌ను సమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నాడు.

Every Captain Wants Him Shubman Gill Hails Mohammed Siraj s All-Out Effort in Test Series

హోరా హోరీగా ..

'ఈ సిరీస్ హోరా హోరీగా సాగింది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఆఖరి రోజు వరకు ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇరు జట్ల అత్యుత్తమ ప్రదర్శనను తెలియజేస్తోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్‌గా నా పని సులువైంది. బంతి రెండు వైపులా స్వింగ్ కావడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. ఈ ఉదయం మా బౌలర్ల స్పెల్ అద్భుతం. ఈ విజయంపై మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఇంగ్లండ్ బ్యాటర్లు నిన్న కూడా ఒత్తిడిలో కనిపించారు.

అతను జట్టులో ఉండటం..

ఒత్తిడిలో చాలా తప్పిదాలు జరుగుతాయి. నాలుగో రోజు ఆట ఆఖరి సెషన్‌లో వారు చేసిన 36 పరుగులను ఒత్తిడిలోనే చేశారు. సిరాజ్‌లాంటి బౌలర్‌ను ప్రతీ కెప్టెన్ కావాలనుకుంటాడు. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో అతను వేసిన ప్రతీ బంతి, ప్రతీ స్పెల్ తన సర్వస్వాన్ని ఇచ్చింది. ప్రతీ కెప్టెన్, ప్రతీ జట్టు అతనిలాంటి ఆటగాడిని కోరుకుంటుంది. అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మా అదృష్టం. ఈ సిరీస్ సమం అవ్వడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ఆసాంతం ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. ఆఖరి రోజు వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని రీతిలో ఈ సిరీస్ సాగింది.

ఆ టార్గెట్‌తోనే బరిలోకి దిగా..

ఇరు జట్లు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాయి. ఈ సిరీస్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ముందే బ్యాటర్‌గా సత్తా చాటాలనుకున్నాను. దాని కోసం కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాను. అత్యుత్తమ బ్యాటర్‌గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ లక్ష్యాన్ని అందుకోవడం సంతోషంగా, సంతృప్తికరంగా ఉంది. బ్యాటర్‌గా రాణించేందుకు టెక్నికల్‌‌గా, మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టాను. మానసికంగా దృఢంగా ఉంటేనే.. రాణించగలుగుతారు. మా యంగ్ టీమ్ కాదు.. గన్ టీమ్'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, August 4, 2025, 19:56 [IST]
Other articles published on Aug 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+