న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Espn Cricinfo team of the Asia Cup 2022: టీమిండియా నుంచి ఇద్దరే.. నో రోహిత్.. కోహ్లీతో పాటు..

Espn Cricinfo Team Of The Asia Cup 2022: Virat Kohli In And Rohit Sharma Out Of Playing 11

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022 టోర్నీలో సత్తా చాటిన అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టులో భారత్‌ నుంచి ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టాప్-2 స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీతో పాటు హయ్యెస్ట్ వికెట్ టేకర్ అయిన భువనేశ్వర్ కుమార్ ఈ బెస్ట్ ఎలెవన్‌కు ఎంపికయ్యారు. 1020 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలోనే సెంచరీ సాధించాడు. అంతేకాకుండా మరో రెండు హాఫ్ సెంచరీలతో 276 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా..

హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా..

ఇక భువనేశ్వర్ కుమార్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 6.05 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో విఫలమైనా..పవర ప్లేలో కొత్త బంతితో రఫ్ఫాడించాడు. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనతతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యాతో కలిసి చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి 11 వికెట్లతో టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతనికి ఆసియాకప్ అత్యుత్తమ జట్టులో చోటు దక్కింది.

లంకనుంచే నలుగురు..

లంకనుంచే నలుగురు..

ఆసియా కప్ ఆరోసారి గెలిచిన శ్రీలంక నుంచి నలుగురు ఆటగాళ్లు ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకోగా.. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అఫ్గానిస్థాన్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్‌తో పాటు అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ అత్యుత్తమ టీమ్ ఓపెనర్లుగా ఎంపికవ్వగా.. ఫస్ట్ డౌన్‌లో విరాట్ చోటు దక్కించుకున్నాడు. మిడిలార్డర్‌లో ఇబ్రహీం జడ్రాన్, భానుక రాజపక్స, డసన్ షనక చోటు దక్కించుకున్నారు.

డసన్ షనకే కెప్టెన్..

డసన్ షనకే కెప్టెన్..

శ్రీలంకను విజేతగా నిలబెట్టిన డసన్ షనకకే ఈ అత్యుత్తమ జట్టు సారథ్యం దక్కింది. వానిందు హసరంగా, మహమ్మద్ నవాజ్ స్పిన్నర్లుగా ఎంపికవ్వగా.. భువీ, హారీస్ రౌఫ్, నసీమ్ షాల పేస్ బౌలర్లుగా ఎంపికయ్యారు. కుశాల్ మెండిస్ 155 పరుగులు చేయగా.. రెహ్మానుల్లా 152 రన్స్ చేశాడు. ఇబ్రహీం జడ్రాన్ 192 పరుగులతో రాణించగా.. భానుక రాజపక్స 191 పరుగులతో సత్తా చాటాడు. డసన్ షనక 111 పరుగులతో పాటు రెండు వికెట్లతో చెలరేగాడు. నవాజ్ 8 వికెట్లతో పాటు 79 పరుగులతో రాణించాడు. హసరంగా 9 వికెట్లతో పాటు ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హరీస్ రౌఫ్ 8 వికెట్లు తీయగా.. నసీమ్ షా 7 వికెట్లు పడగొట్టాడు.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో బెస్ట్ ఆసియాకప్ ఎలెవన్:

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో బెస్ట్ ఆసియాకప్ ఎలెవన్:

కుశాల్ మెండిస్, రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), విరాట్ కోహ్లీ, ఇబ్రహీం జడ్రాన్, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్) వానిందు హసరంగా, మహమ్మద్ నవాజ్, భువనేశ్వర్ కుమార్, హారీస్ రౌఫ్, నసీమ్ షా

Story first published: Tuesday, September 13, 2022, 15:06 [IST]
Other articles published on Sep 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X