
చెత్త ఫీల్డింగ్‌తోనే..
'ఆరంభంలో మా ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. చాలా క్యాచ్‌లు నేలపాలు చేశాం. నేను కూడా తప్పిదాలు చేశా. విలువైన పరుగుల చేయాల్సిన సమయంలో త్వరగా ఔటయ్యా. వాస్తవానికి ఈ వికెట్‌పై మేం చేసింది చాలా తక్కువ పరుగులే. పంజాబ్ కింగ్స్ బాగా ఆడింది. అయితే మ్యాచ్‌లో మేం పుంజుకున్నాం. కానీ క్యాచ్‌లు నేలపాలు చేయడం మాకు తీరని నష్టాన్ని మిగిలిచ్చింది. కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ త్రిపాఠి పట్టినప్పుడు ఔటనే అనుకున్నా. రిప్లేలో నిశితంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ మరోలా తీర్పునిచ్చాడు. ఏది ఏమైనా అంపైర్లదే తుది నిర్ణయం కాబట్టి మనమేం చేయలేం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాల్సిందే. ఆ క్యాచ్ గనుక పట్టుంటే ఫలితం మరోలా ఉండేది'అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

అయ్యర్ హాఫ్ సెంచరీ..
ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 9 ఫోర్లు సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీకి తోడుగా రాహుల్ త్రిపాఠి(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), నితీశ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/32) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

రాహుల్ ఫిఫ్టీ..
అనంతరం పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 రన్స్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. మయాంక్ అగర్వాల్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), షారుఖ్ ఖాన్ విలువైన పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ 2 వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, శివం మావి, వెంకటేశ్ అయ్యర్ తలో వికెట్ తీశారు. ఇక చివరి ఓవర్‌లో షారుఖ్ ఆడిన విన్నింగ్ షాట్.. త్రిపాఠి జారవిడిచాడు. ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

క్యాచ్‌లు పట్టి ఉంటే..
శివం మావి వేసిన 17వ ఓవర్ ఐదో బంతిని షారూఖ్ ఖాన్ భారీ సిక్స్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోవడం ఆ బంతిని బౌండరీలైన్ బయటి పడి సిక్స్‌గా మారింది. ఈ కష్టతరమైన క్యాచ్ డ్రాప్ కోల్‌కతా కొంపముంచింది. మ్యాచ్ మూమెంట్ పంజాబ్ వైపు మళ్లింది. ఆ క్యాచ్ పట్టుంటే ఫలితం మరోలా ఉండేది. అయ్యర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రాహుల్ సెకండ్ బాల్‌కు ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. పంజాబ్ విజయానికి చివరి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ మరుసటి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకున్నంత పని చేసి జార విడిచాడు. దాంతో అది సిక్స్‌గా మారి పంజాబ్ మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన రాహుల్ త్రిపాఠి బంతిని సునాయసంగా అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ చేసుకోలేక జారవిడిచాడు.


Click it and Unblock the Notifications
