Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eoin Morgan Retirement: నా వల్లనే ప్రాబ్లమైతే ఎల్లిపోతరా ఈడికెంచి.! ఆటకు గుడ్‌బై చెప్పిన మోర్గాన్!

 Eoin Morgan retires from international cricket

లండన్: జట్టుకు భారమయ్యానని భావించిన మరు క్షణమే ఆటకు అల్విదా ప్రకటిస్తానని చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. తన మాటను నిలబెట్టుకున్నాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ముందు ఈ వ్యాఖ్యలు చేసిన మోర్గాన్.. ఆ మాటలను ఇప్పుడు నిజం చేశాడు. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడని గత కొద్దిరోజులుగా బ్రీటీష్ మీడియా వరుస కథనాలు ప్రచురించింది. ఇక అందరు ఊహించనట్లుగా ఇయాన్ మోర్గాన్.. తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించాడు. అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సైతం దృవీకరించింది. ఈ మేరకు తమ ప్రపంచకప్ హీరో సేవలను కొనియాడుతూ వరుసగా ట్వీట్లు చేసింది.

 పేలవ ఆటతీరుతో..

పేలవ ఆటతీరుతో..

ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇయాన్ మోర్గాన్.. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాడు. కానీ 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం అతని ఆట గాడితప్పింది. అప్పటి నుంచి ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. వ్యక్తిగతంగా విఫలమైనా.. కెప్టెన్‌గా రాణించడంతో జట్టులో అతని చోటుకు డోకా లేకుండా పోయింది. కానీ గత రెండు మూడు నెలలుగా ఇంగ్లండ్ జట్టులో పరిస్థితులు మారడంతో మోర్గాన్ ఆటకు గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచకప్ అందించిన మొనగాడు..

ప్రపంచకప్ అందించిన మొనగాడు..

ఇయాన్ మోర్గాన్‌ సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. ఈ టోర్నీ అనంతరం మోర్గాన్ ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడిన మెర్గాన్‌ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు దూరమ్యాడు.

2014లో సారథిగా..

2014లో సారథిగా..

వాస్తవానికి మోర్గాన్ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఆడి.. తద్వారా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అతని పేలవ ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్ సమస్యలు ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఇక 2014లో ఇంగ్లండ్ జట్టు సారథ్య బాధ్యతలను పూర్తి స్థాయిలో మోర్గాన్ అందుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జట్టు ప్రదర్శనపై మరింత ఫోకస్ పెట్టిన మోర్గాన్ 2016 టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా.. 2017 చాంపియన్స్ ట్రోఫీలో జట్టును సెమీఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2019లో విశ్వవిజేతగా నిలిపి తొలి ప్రపంచకప్‌ను అందించాడు.

వన్డేల్లో 7 వేల పరుగులు..

ఇప్పటి వరకు 248 వన్డేలు ఆడిన మోర్గాన్ 7701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 2458 పరుగులు సాధించాడు. 16 టెస్ట్‌లు మాత్రమే ఆడిన మోర్గాన్.. గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే వ్యక్తిగత ప్రదర్శన బాగ లేకపోవడంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా.. ఈ సీజన్‌‌లో అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరాడు. ఇక మోర్గాన్ స్థానంలో వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2015 నుంచి ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌గా అతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్‌-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జూలై 7 న ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, June 28, 2022, 19:38 [IST]
Other articles published on Jun 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+