Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమికి మనమే కారణం.. ఆర్‌సీబీ ఆటగాళ్లను అర్సుకున్న విరాట్ కోహ్లీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ పరాజయం‌తో డీలా పడిన ఆర్‌సీబీ ఆటగాళ్లతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. లక్నోతో మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో తన పవర్‌ఫుల్ స్పీ‌చ్‌తో వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. గెలిచిన మ్యాచ్‌ల తరహాలో ఆటను ఆస్వాదించలేకపోవడంతోనే పరాజయాలను మూటగట్టుకున్నామని స్పష్టం చేశాడు.

ఆటను ఆస్వాదించాలి..

ప్రత్యర్థితో పనిలేకుండా ప్రతీ ఒక్కరు ఆటను ఆస్వాదించే ప్రయత్నం చేయాలని సూచించాడు. వరుస మ్యాచ్‌ల్లో ఓడినా పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన స్థానంలో ఉన్నామని, ఈ ఓటమితో దిగులు చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. 'ఈ టోర్నీలో మనకి 6 విజయాలు ఎందుకు దక్కాయి? ఎందుకంటే మనం ఆటను ఆస్వాదించాం. మనం ఫలితం గురించి భయపడలేదు. కేవలం మన ఆటను మనం ఎంజాయ్ చేశాం. అదే మనల్ని గెలిపించింది.

Enjoy the Game Virat Kohli Inspiring Dressing Room Speech to RCB Squad after Defeat against LSG Goes Viral
Photo Credit: screen grab for RCB X Video

మనం కేవలం మన ప్రమాణాల గురించి మాత్రమే ఆలోచించాం తప్ప, ప్రత్యర్థి ఎవరనేది అస్సలు పట్టించుకోలేదు. అవతలి జట్టు జెర్సీ రంగు ఏదైనా సరే.. మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు మీలో పూర్తిస్థాయి ఉత్సాహం, ఆట పట్ల అమితమైన ఇష్టాన్ని నేను చూడాలనుకుంటున్నాను. మైదానంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యర్థి కంటే మన ఆట మీద మనకు పట్టు ఉండాలి.

మన స్థాయికి తగ్గట్లు ఆడితే..

ఓటమి నేర్పిన పాఠంతో మరింత బలంగా తిరిగి రావాలి. మనం మన స్థాయికి తగ్గట్టు ఆడితే.. ఏ జట్టైనా మన ముందు తలవంచాల్సిందే. జెర్సీ రంగు ఏదైనా, మన పోరాట పటిమ ఒక్కటే కావాలి. పాయింట్స్ టేబుల్‌లో మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.'అని తన సహచర ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ సూచించాడు.

ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ప్రస్తుతం ఆర్‌సీబీ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మూడు గెలిస్తే రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిస్తే.. టాప్-2 ప్లేస్ ఖరారు అవుతుంది. అయితే తమ తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండటం.. తమ హోమ్ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్ లేకపోవడం ఆర్‌సీబీని కలవరపెడుతోంది.

Story first published: Friday, May 8, 2026, 18:14 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+