Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs AUS: టామ్ కరన్ సూపర్ బౌలింగ్.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ సంచలన విజయం!!

ENGvAUS 1st T20I: Tom Curran’s super bowling helps England beat Australia in a thriller

సౌతాంఫ్టన్: టీ20 క్రికెట్‌లో తనకి తిరుగులేదని ఇంగ్లండ్ మరోసారి నిరూపించింది. సౌతాంఫ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడి సంచలన విజయాన్ని అందుకుంది. పటిష్ట ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బౌలర్లు అడ్డుకోవడంతో కేవలం 2 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. మార్కస్ స్టాయినిస్ భారీ సిక్స్ బాదినా.. టామ్ కరన్ సూపర్ బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బట్లర్ జోరు:

బట్లర్ జోరు:

తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (44: 29 బంతుల్లో 5x4, 2x6) మెరుపు మెరిపించాడు. క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మాత్రం నెమ్మదిగా ఆడాడు. మొదటి నాలుగు ఓవర్లలో బెయిర్‌స్టో ఆడింది కేవలం 7 బంతులే. అంటే బట్లర్ స్ట్రైక్ తీసుకుని భారీ షాట్లు ఆడాడు. బెయిర్‌స్టో 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.

మలాన్ అర్ధ సెంచరీ:

మలాన్ అర్ధ సెంచరీ:

స్కోర్ పెంచే క్రమంలో బట్లర్ భారీ షాట్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (66: 43 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఒకానొక దశలో ఇంగీష్ జట్టు 180పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ డెత్ ఓవర్లలో పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 162/7 కే పరిమితమైంది. టామ్ బాంటన్ (8), ఇయన్ మోర్గాన్ (5), మొయిన్ అలీ (2), టామ్ కరణ్ (6) నిరాశపరిచాడు. చివరలో క్రిస్ జోర్డాన్ (14) ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, ఆస్టన్ అగర్, గ్లెన్ మాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు.

వార్నర్ హాఫ్ సెంచరీ:

వార్నర్ హాఫ్ సెంచరీ:

లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (58: 47 బంతుల్లో 4x4), అరోన్ ఫించ్ (46: 32 బంతుల్లో 7x4, 1x6) జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. వార్నర్ ఆచితూచి ఆడినా.. ఫించ్ ధాటిగా ఆడాడు. తొలి వికెట్‌కి 11 ఓవర్లలో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫించ్ ఔట్ అయినా.. వార్నర్ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో ఆసీస్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మిడిల్ ఆసీస్ ఓవర్లలో బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. స్టీవ్‌ స్మిత్ (18), గ్లెన్ మాక్స్‌వెల్ (1), అలెక్స్ క్యారీ (1), అస్గన్ అగర్ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

 కరన్ సూపర్ బౌలింగ్:

కరన్ సూపర్ బౌలింగ్:

ఇక చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. మార్కస్ స్టాయినిస్ (23 నాటౌట్: 18 బంతుల్లో 1x6) క్రీజులో ఉండటంతో ఆస్ట్రేలియా విజయంపై ధీమాగా ఉంది. 20వ ఓవర్ వేసిన టామ్ కరన్ మొదట తడబడ్డా.. చివరి మూడు బంతులను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌‌లో 0, 6, 0, 2, 2, 2 పరుగులు ఇచ్చాడు. వరుస యార్కర్లు సంధించిన కరన్.. స్టాయినిస్‌ని మరో సిక్స్ కొట్టకుండా నిలువరించాడు. దీంతో ఆసీస్ 2 పరుగుల తేడాతో గెలిచింది. మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మ్యాచ్‌ సౌథాంప్టన్ వేదికగానే ఆదివారం జరగనుంది.

CPL 2020: వైరల్ వీడియో.. మైదానంలోని వర్షం నీటిలో పరుగెత్తుతూ ఎంజాయ్ చేసిన క్రికెటర్!!

Story first published: Saturday, September 5, 2020, 12:33 [IST]
Other articles published on Sep 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+