
చెరువులా లారా మైదానం:
గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తల్లావాస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరణుడు అడ్డుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేస్తున్న సెయింట్ కిట్స్ 5.4 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 46 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. దాంతో బ్రియాన్ లారా మైదానం మొత్తం చెరువులా మారింది. ఇదే సమయంలో సెయింట్ కిట్స్ బ్యాట్స్‌మన్ బెన్ డంక్ మైదానంలోని ఒక చివర నుండి మరో చివరకు పరుగెత్తాడు. అక్కడినుండి తిరిగి మళ్లీ వెనక్కు పరుగు పెట్టాడు. మైదానంలో అతడు ఎక్కడా ఆగకుండా పరుగెత్తడం విశేషం.

వర్షం నీటిలో ఎంజాయ్:
మైదానంలో బెన్ డంక్ పరుగు చూసి వెస్టిండీస్ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఆశ్చర్యపోయాడు. డంక్ డగౌట్ చేరుకోగానే అక్కడివారు అతన్ని ప్రశంసించారు. మొత్తానికి ఆస్ట్రేలియా క్రికెటర్ మైదానంలోని వర్షం నీటిలో పరుగెత్తుతూ తెగ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు.. డంక్ 'ఏమా పరుగు' అని పొగిడేస్తున్నారు. పిచ్ పరిశీలించడానికి వెళ్లాడేమో అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా అలా వర్షంలో పరుగెత్తిన మొదటి క్రికెటర్ డంకే. సెయింట్ కిట్స్ తమ మొదటి విజయం సాధించడంలో డంక్ కీలక పాత్ర పోషించాడు. 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
గాల్లో పిల్లిమొగ్గలు:
గయానా అమేజాన్ వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో గయానా బౌలర్ కెవిన్ సింక్లెయిర్ వికెట్ తీసిన ఆనందంలో చేసిన ప్రమాదకరమైన ఫీట్ తెగ వైరల్ అవుతోంది. రెండుసార్లు గాల్లో పిల్లిమొగ్గలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కామెంటేటర్ దానిని ప్రమాదకరమైన ఫీట్‌గా కూడా అభివర్ణించాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ప్రమాదకరంగా మారిన మిచెల్ శాంట్నర్ (18 పరుగులు)ను సింక్లెయిర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

టోర్నీ నుంచి సెయింట్ కిట్స్ నిష్క్రమణ:
సీపీఎల్ 2020లో 9 మ్యాచులు ఆడిన సెయింట్ కిట్స్.. 3 పాయింట్లతో సెమీస్ నుంచి అధికారికంగా తప్పుకుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు మొత్తం 10 మ్యాచులు ఆడుతుంది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన సెయింట్ కిట్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకుంది. ఏకంగా 7 మ్యాచులు ఓడిపోయింది. చివరి మ్యాచ్ సెప్టెంబర్ 6న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుతో ఆడనుంది.సెయింట్ కిట్స్ కెప్టెన్ రాయద్ ఎమిరిట్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. స్టార్ ఓపెనర్లు ఎవిన్ లెవిస్, క్రిస్ లిన్ ఉన్నా.. పెద్దగా ఆకట్టుకోలేకయారు.
CSK: చెన్నై ఆటగాళ్లకి కరోనా నెగటివ్.. లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబైతోనే ఢీ!!


Click it and Unblock the Notifications












