
మాంచెస్టర్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి భారత యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ 'రాయల్ లండన్ కప్'లో అతను లాంకషైర్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు లాంకషైర్ టీమ్ ట్వీట్ చేసింది. భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో 2021 రాయల్ లండన్ కప్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
జూలై 15న అయ్యర్ జట్టుతో చేరతాడు. ఈ వన్డే టోర్నీలో భాగంగా నెల రోజుల పాటు జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కోసం కాకుండా అయ్యర్ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్‌తో జత కట్టాడు. గతంలో భారత్ నుంచి ఫరూఖ్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఈ కౌంటీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.
'ఇంగ్లిష్ క్రికెట్లో లాంకషైర్‌కు ఎంతో పేరుంది. భారత క్రికెట్‌తో దానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఫరూక్ ఇంజినీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ ప్రపంచ స్థాయి స్టేడియం. నా జట్టు సభ్యులను అక్కడ కలుసుకొనేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నా' అని శ్రేయస్ సంతోషం వ్యక్తం చేశాడు.
'ది హండ్రెడ్ వల్ల ఈ ఏడాది రాయల్ లండన్ కప్‌లో మేం యువకులతో బరిలోకి దిగుతామన్న అంచనాలు ఉన్నాయి. టోర్నీలో మేం రాణించేందుకు టాప్ ఆర్డర్లో ఆడగల అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ మాకు అవసరం. శ్రేయస్‌కు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలిగే అతని నైపుణ్యాలు మా యువ జట్టుకు ఎంతో అవసరం. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై అతని ఫామ్ ఆకట్టుకుంటోంది' అని లాంకషైర్ క్రికెట్ డైరెక్టర్ పాల్ అలాట్ అన్నాడు.