Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న ఈ ఆల్‌టైమ్ గ్రేట్ పేసర్.. జూలైలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్‌తో ఆటకు గుడ్‌బై చెబుతున్న ప్రకటించాడు. తన 21 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో అండర్సన్ 700 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫీట్ సాధించిన తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ ఏడాది భారత గడ్డపై జరిగిన టెస్ట్‌ సిరీస్‌లోనే అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని అండర్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.

England s James Anderson announces retirement after Lord s Test against West Indies in July

'అందరికి హాయ్.. ఈ సమ్మర్‌లో జరిగే తొలి టెస్ట్ నా కెరీర్‌లో చివరి మ్యాచ్. నా దేశానికి 20 ఏళ్లు ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. ఆట నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉంది. అయితే వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం.

నాలానే దేశం తరఫున ఆడాలని కలలు కనే కుర్రాళ్లకు అవకాశం దక్కుతుంది. దేశం తరఫున క్రికెట్ ఆడటం కంటే మించిన ఆనందం మరొకటి లేదు.నా కుటుంబ సభ్యులు, కోచ్‌ల సహకారంలోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.'అని అండర్సన్ పేర్కొన్నాడు.

అయితే ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకోవడంతోనే 41 ఏళ్ల అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇంగ్లీష్ మీడియా పేర్కొంది. యాషెస్ సిరీస్ కోసం యంగ్ టీమ్‌ను సిద్దం చేయాలని ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2003లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అండర్సన్ మొత్తం 187 మ్యాచ్‌లు ఆడి 700 వికెట్లు తీసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 194 వన్డేలు, 19 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరణ్ టాప్‌లో ఉండగా.. షేన్ వార్న్(708) అండర్సన్(700) కన్నా ముందున్నారు.

Story first published: Saturday, May 11, 2024, 18:18 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+