Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్!

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా బరిలోకి దిగిన 37 ఏళ్ల డేవిడ్ మలన్.. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరఫున డేవిడ్ మలన్ 22 టెస్ట్‌లు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. టీ20ల్లో డేవిడ్ మలన్‌కు మంచి రికార్డ్ ఉంది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా మలన్ గుర్తింపు పొందాడు. 24 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ రికార్డ్ అందుకున్నాడు.

England s Dawid Malan announces retirement from international cricket at 37

2020 సెప్టెంబర్‌లో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. జోస్ బట్లర్ తర్వాత ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టెస్ట్‌ల్లో, టీ20ల్లో ఒక్కో శతకం సాధించిన మలన్ వన్డేల్లో మాత్రం 6 సెంచరీలు నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో 1074, వన్డేల్లో 1450, టీ20ల్లో 1892 రన్స్ చేశాడు.

2017లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో మలన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే 44 బంతుల్లో 78 పరుగులు చేసి అందర దృష్టిని ఆకర్షించాడు. 2017లో యాషెస్ సిరీస్‌లో మెరుపు శతకం బాదాడు. ఈ 140 పరుగుల ఇన్నింగ్సే అతని టెస్ట్ కెరీర్‌లో ఏకైక శతకం.

ఇంగ్లండ్ విజేతగా నిలిచిన టీ20 ప్రపంచకప్ 2022 ఆడిన డేవిడ్ మలన్.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. దాంతో నాకౌట్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో సత్తా చాటిన డేవిడ్ మలన్.. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మలన్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

Story first published: Wednesday, August 28, 2024, 15:48 [IST]
Other articles published on Aug 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+