For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ మొదలైందోచ్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!

England vs West Indies: Ben Stokes wins toss, England opt to bat

సౌతాంప్టన్: 117 రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు క్రికెట్ మొదలైంది. వర్షం అంతరాయం కలిగించినా.. ఆలస్యంగానైనా వెస్టిండీస్-ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బయో సెక్యూర్ వాతావరణంలో ఈ మ్యాచ్ జరగుతుంది. జోరూట్ గైర్హాజరీతో బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టు నడిపించనుండగా.. జాసన్ హోల్డర్ సారథ్యంలో విండీస్ బరిలోకి దిగింది.

ఇన్నాళ్ల తర్వాత ప్రారంభమైన ఆటలో తొలి ఓవర్ కెమర్ రోచ్ వేయగా.. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికే ఆ జట్టు ఓపెనర్ డీపీ సిబ్లే(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జో డెన్లీ(0), రోరీ బర్న్స్(1) ఉన్నారు.

ఇక భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. కనీసం టాస్ వేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విధించిన తాత్కలిక నిబంధనల మధ్య ప్రేక్షకుల్లేకుండా మైదానంలోకి ఆటగాళ్లు బరిలోకి దిగారు. టచింగ్, హగ్గింగ్ సంబరాలు లేకుండానే కొత్తగా వింతగా మ్యాచ్ ఆడుతున్నారు.

ఇక 2020 మార్చి 13. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య చివరి క్రికెట్ మ్యాచ్ జరగ్గా.. 117 రోజుల తర్వాత జూన్ 8 ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య మళ్లీ మొదలైంది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్దం తర్వాత క్రికెట్‌కు ఇంత లాంగ్ బ్రేక్ వచ్చింది లేదు. వరల్డ్ వార్ టైమ్‌లోనూ భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగింది. కానీ కరోనా దెబ్బకు మూడు నెలలుగా అన్ని చోట్ల క్రికెట్ ఆగింది.

తుది జట్లు:

ఇంగ్లండ్: రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, జో డెన్లీ, జక్ క్రాలీ, బెన్ స్టోక్స్(కెప్టెన్), ఒల్లీ పోప్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డామ్ బెస్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్

వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, బ్రాత్ వైట్, శమరా బ్రూక్స్, షై హోప్, రోస్టన్ చేజ్, జెర్మానీ బ్లాక్ వుడ్, షేన్ డౌరిచ్(కీపర్), జాసన్ హోల్డర్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, షెనన్ గాబ్రియల్

Story first published: Wednesday, July 8, 2020, 19:10 [IST]
Other articles published on Jul 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+