Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయం వేటలో ఇంగ్లండ్‌.. ఓటమి నుంచి గట్టెక్కే ప్రయత్నంలో విండీస్

England vs West Indies 3rd Test: West Indies 10/2 at stumps, need 389 more runs to win

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళ్తుంది. స్టువర్ట్ బ్రాడ్(6/31) సూప‌ర్ బౌలింగ్‌కు తోడు.. రోరీ బర్న్స్ (163 బంతుల్లో 10 ఫోర్లతో 90) వీరోచిత బ్యాటింగ్‌తో చెలరేగడంతో... నిర్ణయాత్మక మూడో టెస్ట్ ఇంగ్లండ్ చేతుల్లోకి వచ్చేసింది. బౌలింగ్‌లో విఫలమైన విండీస్.. బ్యాటింగ్‌లోనూ తడబడటంతో.. ఆతిథ్య జట్టు మూడో రోజే పట్టు బిగించింది. హోల్డర్(82 బంతుల్లో 6 ఫోర్లతో 46), డౌరిచ్(37) పోరాటంతో ఫాలో ఆన్ తప్పించుకున్న కరీబియన్ల ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దీనిని అధిగమించే క్రమంలో విండీస్ అప్పుడే రెండు వికెట్లను చేజార్చుకొని ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 10 రన్స్ చేసింది. బ్రాత్‌వైట్‌ (2 బ్యాటింగ్‌), హోప్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇక అద్భుతం జరిగితే తప్ప ఓటమి నుంచి గట్టెక్కడం విండీస్ వీరులకు ఆసాధ్యం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గెలుపు నేడే జరగొచ్చు.

ఇంగ్లండ్ 226 డిక్లేర్డ్..

ఇంగ్లండ్ 226 డిక్లేర్డ్..

అంతకుముందు ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్లకు 226 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రోరీ బర్న్స్‌ (90; 10 ఫోర్లు), జో రూట్‌ (68 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), డామ్‌ సిబ్లీ (56; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 137/6తో ఆట కొన సాగించిన విండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 172 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్‌ 6 వికెట్లతో చెలరేగాడు.

చెలరేగిన బ్రాడ్

చెలరేగిన బ్రాడ్

17.5 ఓవర్లు... 60 పరుగులు ... 4 వికెట్లు ... ఆదివారం వెస్టిండీస్‌ ఆట ఇది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ హోల్డర్, డౌరిచ్‌ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆట కొనసాగించారు. అయితే ఒక్కసారి ఈ జోడీ విడిపోయిన తర్వాత జట్టు ఆలౌట్‌ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. విండీస్‌ తమ చివరి 4 వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది. ఈ నాలుగూ బ్రాడ్‌ ఖాతాలోకి వెళ్లాయి.

బర్స్న్ సెంచరీ మిస్

బర్స్న్ సెంచరీ మిస్

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను బర్న్స్, సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. ముందుగా సిబ్లీ 121 బంతుల్లో, బర్న్స్‌ 111 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. ఎట్టకేలకు 114 పరుగుల శతక భాగస్వామ్యం తర్వాత సిబ్లీని అవుట్‌ చేసి హోల్డర్‌ ఈ జోడిని విడగొట్టాడు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ రూట్‌ దూకుడు ఆడి 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు శతకానికి చేరువైన బర్న్స్‌... ఛేజ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లండ్‌ డిక్లేర్‌ చేసింది.

2000 పరుగులు, 100 వికెట్లు..

2000 పరుగులు, 100 వికెట్లు..

వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ ఈ మ్యాచ్‌ ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. బ్యాటింగ్‌లో 2000 పరుగులు.. బౌలింగ్‌లో 100+ వికెట్లు తీసిన మూడో విండీస్‌ క్రికెటర్‌గా హోల్డర్‌ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్‌, కార్ల్‌ హూపర్‌ ఈ ఘనత సాధించారు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో విండీస్‌ కెప్టెన్‌ అయ్యాడు. సోబర్స్‌ (117) ముందున్నాడు. మరోవైపు టెస్టులు, వన్డేల్లోనూ 100+ వికెట్లు తీసిన నాలుగో కెప్టెన్‌గా హోల్డర్‌ నిలిచాడు. అతడికంటే ముందు ఇమ్రాన్‌, వసీం అక్రమ్‌, పొలాక్‌ ఉన్నారు.

సంక్షిప్త స్కోర్లు..

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 369

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 226/2 డిక్లేర్డ్;

విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 10/2

Story first published: Monday, July 27, 2020, 8:21 [IST]
Other articles published on Jul 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+