న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్, అండర్సన్ ఆగయా.. విండీస్ జట్టులోకి భారీకాయుడు.. ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్

England vs West Indies 3rd Test: Roach removes Sibley for a duck after WI opt to bowl

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నిర్ణయాక టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇరు జట్లు స్వల్ప మార్పులు చేశాయి. రెండో టెస్ట్‌కు దూరమైన జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్ ఇంగ్లండ్ జట్టులోకి రాగా.. సామ్ కరన్, జాక్ క్రాలీ ఉద్వాసనకు గురయ్యారు. ఇక వెస్టిండీస్ జట్టులో అల్జారీ జోసేఫ్ స్థానంలో భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ చోటు దక్కించుకున్నాడు.

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో గెలపుతో మంచి జోష్ మీదున్న ఇరుజట్లు.. ఇప్పుడు సిరీసే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చరిత్రాత్మక విజయాన్నందుకోవాలని విండీస్ ఉవ్విళ్లూరుతుంటే.. ప్రతీకారం కోసం ఇంగ్లండ్ రగిలిపోతుంది. అయితే రెండు జట్ల బలం, బలగం సమానంగానే కనిపిస్తున్నా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సూపర్ పెర్ఫామెన్స్.. ఆతిథ్య జట్టుకు కొండంత అండగా మారింది.

కానీ తొలి టెస్ట్‌లో విజృంభించిన కరీబియన్ కెప్టెన్ జాసన్ హోల్డర్, షెనన్ గాబ్రియేల్ మరోసారి మెరిస్తే ఇంగ్లీష్ టీమ్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఓవైపు ఆరేళ్లుగా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోని ఇంగ్లండ్.. మరోవైపు 1988 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న విండీస్.. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆఖారట ప్రారంభమైంది. తొలి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌కే ఆ జట్టు ఓపెనర్ డామ్ సిబ్లే(0).. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 3 రన్స్ చేసింది. క్రీజులో రోరి బర్న్స్(3), జోరూట్(0) ఉన్నారు.

తుది జట్లు:
ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జో రూట్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, ఒల్లీ పోప్‌, డామ్‌ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

విండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌, షమర బ్రూక్స్‌, రోస్టన్‌ చేజ్‌, జెర్మెయిన్‌ బ్లాక్‌వుడ్‌, షేన్‌ డౌరిచ్‌, జేసన్‌ హోల్డర్‌, కీమర్‌ రోచ్‌, రకీమ్‌ కార్న్‌వాల్‌, షానన్‌ గాబ్రియెల్‌.

Story first published: Friday, July 24, 2020, 16:10 [IST]
Other articles published on Jul 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X