Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బయో సెక్యూర్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఆర్చర్.. ‌జట్టు నుంచి ఔట్‌!!

England vs West Indies 2nd Test: Jofra Archer out for breaking bio-secure protocols

మాంచెస్టర్‌: కరోనా వైరస్ భయపెడుతున్నా మరో టెస్టుకు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం మధ్యాహ్నం జరగనున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ పర్యాటక వెస్టిండీస్ తలపడనున్నాయి. మొదటి టెస్టులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడిన నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌ అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటిన విండీస్‌.. తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని విండీస్ చూస్తుంటే.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

బయో సెక్యూర్‌ వాతావరణంలో

బయో సెక్యూర్‌ వాతావరణంలో

వైరస్‌ పతాక స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహిస్తోంది. దీంతో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది, మైదాన సిబ్బంది అంపైర్లు, వ్యాఖ్యాతలు ఇలా అందరూ బయో సెక్యూర్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పటిష్ట జాగ్రత్తలతో ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఈ నిబంధనలు ఏర్పాట్లు చేశారు.

రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఆర్చర్

రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఆర్చర్

అయితే వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ బయో సెక్యూర్‌ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించాడు. దీంతో ఈసీబీ అతనిపై వేటు వేసింది. బయో సెక్యూర్‌ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించాడని మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతన్ని పక్కనపెట్టేశారు. ఆటగాళ్ల భద్రత కారణంగానే ఆర్చర్‌ను జట్టు నుంచి తప్పించామని ఈసీబీ తెలిపింది. అయితే ఆర్చర్‌ ఏ నిబంధనలను బ్రేక్‌ చేశాడనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆర్చర్‌ స్థానంలో ఎవరిని తుది జట్టుకు ఎంపిక చేశారనే విషయాన్నికూడా వెల్లడించలేదు. టాస్‌ సమయంలో కెప్టెన్‌ జో రూట్‌ అసలు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో

ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో

తాను చేసిన పనికి జోఫ్రా ఆర్చర్ క్షమాపణలు చెప్పాడు. 'నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. నా తప్పును పూర్తిగా అంగీకరిస్తున్నా. నా పొరపాటు కారణంగా నేను మాత్రమే కాదు, మొత్తం జట్టు ప్రమాదంలో ఉంది' అని అన్నాడు. ఆర్చర్ ఇప్పుడు ఐదు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఈ ఐదు రోజులలో రెండు సార్లు వైరస్ పరీక్షలు చేయగా.. నెగటివ్ వస్తే అప్పుడు క్వారంటైన్‌ను ఎత్తివేయనున్నారు.

అండర్సన్, వుడ్‌‌లపై వేటు

అండర్సన్, వుడ్‌‌లపై వేటు

తన భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని భావించి తొలి టెస్టుకి దూరమైన రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, యువ పేసర్ శామ్ కరన్‌ కూడా టీమ్‌లోకి వచ్చారు. తొలి టెస్టులో రాణించలేకపోయిన ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, మార్క్‌ వుడ్‌‌లపై వేటు పడింది. వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, శామ్ కరన్‌లని తీసుకుంది. ఇక రూట్ జట్టులోకి రావడంతో.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జె డెన్లీని పక్కన పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.

రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇదే:

జో రూట్ (కెప్టెన్), డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాక్ క్రావ్లీ, శామ్ కరన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్‌సన్, డోమ్ సిబ్లీ, బెన్‌ స్టోక్స్, క్రిస్‌వోక్స్.

5 స్టార్ కాదు.. చిన్న 3 స్టార్ హోటల్‌లోనే పాకిస్తాన్ క్రికెటర్ల బస!!

Story first published: Thursday, July 16, 2020, 14:21 [IST]
Other articles published on Jul 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+