Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాత్‌వైట్ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న విండీస్

England vs West Indies 2nd Test: Fifty for Brathwaite after Curran removes Hope

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ 58ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రైగ్ బ్రాత్‌వైట్(65 నాటౌట్)తో పాటు బ్రూక్స్ (32 నాటౌట్) ఉన్నాడు. ఇంగ్లండ్ కన్నా హోల్డర్ సేన 294 పరుగులు వెనుకంజలో ఉంది.

వర్షం కారణంగా మూడో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. 32/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ నిలకడగా ఆడుతుంది. చిన్న చిన్న భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తుంది. నైట్‌ వాచ్‌మన్‌ అల్జారి జోసెఫ్‌ (32)తో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(62 బ్యాటింగ్) రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇక క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని డామ్ బెస్ విడదీశాడు. జోసెఫ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన షై హోప్‌(25)తో బ్రాత్‌వైట్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆతిథ్య బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. దీంతో విండీస్ 118/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ అనంతరమే విండీస్ షైహోప్ వికెట్ కోల్పోయింది. సామ్ కరణ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్రాత్ వైట్ 121 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 19వ టెస్ట్ అర్థ సెంచరీ నమోదు చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ 1-0తో లీడ్‌లో ఉంది.

Story first published: Sunday, July 19, 2020, 19:32 [IST]
Other articles published on Jul 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+