Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రీస్టార్ట్‌కు రెయిన్ ఆటంకం.. మొదలవ్వని ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్

England vs West Indies 1st Test: Toss delayed due to wet weather in Southampton

సౌతాంప్టన్‌: 117 రోజుల నిరీక్షణ తర్వాత.. కరోనాతో రద్దు, వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు సిద్దమైన ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాంప్టన్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. చిరుజల్లులు కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.

వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి టాస్ వేసేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. వర్షం కారణంగా నేలంతా తడిగా మారింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కారు మేఘాలు కమ్ముకున్నాయి. కనీసం టాస్ వేసుకునే అవకాశం కూడా లభించలేదు.

ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. పలుమార్లు మైదానంలో కవర్ల పరుస్తూ తీస్తూ.. అంపైర్లు మైదానాన్ని పరీక్షించారు. దీంతో అంపైర్లు త్వరగా లంచ్ విరామాన్ని ప్రకటించారు.

ఇక గత కొద్దిరోజుల నుంచి సౌతాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉంటున్నది. శుక్రవారం వరకు అప్పుడప్పుడూ చిరుజల్లులు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ తెలిపింది.

Story first published: Wednesday, July 8, 2020, 17:29 [IST]
Other articles published on Jul 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+