For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్లాక్‌వుడ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌పై విండీస్‌ విజయం.. తొలి బయోబబుల్‌ టెస్టు సక్సెస్!!

England vs West Indies 1st Test: Jermaine Blackwood’s 95 leads West Indies to 4-wicket win

సౌతాంప్టన్‌: కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత జరిగిన తొలి బయోబబుల్‌ టెస్టు‌ విజయవంతం అయింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో విండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. విండీస్ పేసర్ షెనాన్ గాబ్రియల్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

హోల్డర్ సిక్సర్:

హోల్డర్ సిక్సర్:

వర్షం దోబూచులాడిన మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ 204 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రమే (43) రాణించాడు. విండీస్‌ బౌలర్లలో కెప్టెన్ జేసన్ హోల్డర్‌ 6, గాబ్రియేల్‌ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్‌ 318 పరుగులు చేసి 114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 4, అండర్సన్‌ 3, బెస్‌ 2, మార్క్‌ వుడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. బ్రాత్‌వైట్‌ (65) హాఫ్ సెంచరీ చేశాడు.

60 పరుగులకే ఆరు వికెట్లు:

60 పరుగులకే ఆరు వికెట్లు:

114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బర్న్స్‌ (42), సిబ్లీ (50) తొలి వికెట్‌కు 72 పరుగుల శుభారంభం ఇచ్చారు. డెన్లీ 29, జాక్‌ 79, స్టోక్స్‌ 46, ఆర్చర్‌ 23, పోప్‌ 12 పరుగులు చేశారు. అయితే విండీస్‌ బౌలర్లు రాణించడంతో.. ఇంగ్లండ్‌ వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. కేవలం 60 పరుగులకే ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటై.. విండీస్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గాబ్రియేల్‌ 5, జోసెఫ్‌ 2, ఛేజ్ 2, హోల్డర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

బ్లాక్‌వుడ్‌ సూపర్‌ ఇన్నింగ్స్:

బ్లాక్‌వుడ్‌ సూపర్‌ ఇన్నింగ్స్:

రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లిష్‌ పేసర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరగడంతో విండీస్‌ ఒక దశలో 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌ (4), హోప్‌ (9), బ్రూక్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ దశలో చేజ్‌ (37)తో కలిసి బ్లాక్‌వుడ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇంగ్లండ్‌ పేసర్లు బౌన్సర్లతో పరీక్ష పెడుతున్నా.. అకుంఠిత దీక్షతో క్రీజులో నిలబడ్డాడు. చేజ్‌ పెవిలియన్ చేరిన అనంతరం డౌరిచ్ అండతో జట్టును విజయానికి చేరువచేశాడు. చివరలో హోల్డర్ మిగతా పని పూర్తిచేశాడు.

కరీబియన్లు కసిగా:

కరీబియన్లు కసిగా:

బ్యాటింగ్‌ బలం.. బౌలింగ్‌ దళం.. బీభత్సంగా ఉన్న ఇంగ్లండ్‌కు వెస్టిండీస్‌ పోటీఇస్తే అదే ఎక్కువ!! ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందు సగటు క్రీడాభిమానుల ఆలోచన ఇది. కానీ ఏదో అల్లాటప్పాగా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టలేదు.. ఇక్కడికి వచ్చింది సిరీస్‌ నెగ్గేందుకే! అని వెస్టిండీస్‌ జట్టు ఐదు రోజులు తిరిగేలోపే నిరూపించింది. ఇటీవలి కాలంలో విండీస్‌ జట్టు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలాంటి ప్రదర్శన చేసింది లేదు. నాలుగు ధనాధన్‌ షాట్లు ఆడి ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్దామా అనే రీతిలో ఉండేది కరీబియన్ల ఆటతీరు. కానీ జట్టుగా కలిసి ఆడితే వారు ఎలాంటి అద్భుతాలు చేయగలరో ఈ మ్యాచ్‌ మరోసారి రుజువు చేసింది.

స్కోరు వివరాలు:

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 204 ఆలౌట్‌

వెస్టిండీస్‌ తొలి ఇన్సింగ్స్‌ 310 ఆలౌట్‌

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 313 ఆలౌట్‌

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 200/6

నా రిటైర్మెంట్ మ్యాచ్‌లో ధోనీ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు: దాదా

Story first published: Monday, July 13, 2020, 8:48 [IST]
Other articles published on Jul 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+