
నాగ్‌పూర్‌లో చివరి టెస్టు:
రిటైర్మెంట్ మ్యాచ్ గురించి ఓపెనర్ మయాంక్ అగర్వాత్‌తో 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' ఛాట్ షోలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'నాగ్‌పూర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాను. ఆరోజు మ్యాచ్‌లో ఆఖరి రోజు.. లాస్ట్ సెషన్ కూడా. విదర్భ స్టేడియంలో మెట్ల నుండి కిందకు వస్తున్నా. నా సహచరులు గార్డ్ హాఫ్ హానర్‌తో మైదానంలోకి ఆహ్వానించారు. ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపించింది. ఇక అభిమానులు అయితే కేరింతలతో సందడి చేశారు. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను' అని అన్నాడు.

ధోనీ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు:
' నాగ్‌పూర్ టెస్ట్ చివరి సెషన్ ఆఖర్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ నా వద్దకు వచ్చి కెప్టెన్‌గా జట్టుని నడిపించమని కోరాడు. ఆ సర్‌ప్రైజ్‌ని నేను అస్సలు ఊహించలేదు. అప్పడు నా మైండ్ మొత్తం రిటైర్మెంట్ ఆలోచనలతో నిండిపోయింది కాబట్టి చివరి 3-4 ఓవర్లలో కెప్టెన్‌గా ఎలా వ్యవహరించానో నాకు గుర్తులేదు. మొత్తానికి భారత్ గెలిచింది' అని దాదా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది.

దాదా కెప్టెన్సీలోనే మహీ ఎంట్రీ:
సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. అందరూ కూడా ఓ వెలుగువెలిగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు ఉన్నారు. వీరందరూ విఫలమయిన ప్రతిసారి అండగా నిలిచేవాడు. దాదా కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. ఆ తర్వాత కూడా తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ ధోనీకి వరుస అవకాశాలిచ్చిన గంగూలీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.3లో పంపి ప్రోత్సహించాడు. ఆ తర్వాత అద్భుత సారథిగా ఓ వెలుగువెలిగాడు. దాంతో ధోనీ కూడా గంగూలీపై తన గౌరవాన్ని అలా చాటుకున్నాడు.

113 టెస్టులు.. 311 వన్డేలు:
భారత్ తరఫున కెరీర్‌లో 113 టెస్టులాడిన సౌరవ్ గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 239. 311 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించాడు. గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలాడిన టీమిండియా.. 76 మ్యాచ్‌ల్లో గెలుపొంది 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. టెస్టు ఫార్మాట్‌లోనూ దాదా కెప్టెన్సీలో భారత్ జట్టు 49 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.


Click it and Unblock the Notifications
