Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రారంభమైన రెండో రోజు ఆట.. చెలరేగుతున్న గాబ్రియెల్.. మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

England vs West Indies 1st Test: Gabriel double blow dents England

సౌతాంప్టన్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు వరుణుడి ఆటంకంతో 17.4 ఓవర్లపాటే మ్యాచ్ జరగ్గా.. రెండో రోజు ఎలాంటి అంతరాయం లేకుండా పున:ప్రారంభమైంది. ఇక 35/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. వెస్టిండీస్ బౌలర్ షెనాన్ గాబ్రియల్ తనదైన బౌలింగ్‌తో చెలరేగుతున్నాడు.

తొలి రోజే ఇంగ్లండ్‌ను దెబ్బతీసిన షెనాన్ గాబ్రియెల్.. రెండో రోజు తన ఫామ్‌ను కొనసాగించాడు. సుమారు పది నెలల తర్వాత దక్కిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసిపట్టుకున్నాడు. ఫస్ట్ డే తన ఫస్ట్ ఓవర్లోనే ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్ సిబ్లీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన గాబ్రియెల్.. రెండో రోజు ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ డెన్లీ(58 బంతుల్లో 18)ని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం రోరీ బర్న్స్ (85 బంతుల్లో 30)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు.

దీంతో 26 ఓవర్లలో ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో బెన్‌స్టోక్స్ (0), జాక్ క్రాలీ(0) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ రోరీ బర్న్స్.. 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Story first published: Thursday, July 9, 2020, 16:37 [IST]
Other articles published on Jul 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+