
వణికించిన జాసన్ హోల్డర్...
తొలి రోజు వరుణుడి ఆటంకంతో 17.4 ఓవర్లపాటే మ్యాచ్ జరగింది. పలుమార్లు ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు ముందుగానే ఆటను నిలిపేసారు. ఇక 35/1 ఓవర్ నైట్ స్కోర్‌తో ఇంగ్లండ్ రెండో రోజు ఆటను ప్రారంభించగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బంతితో విజృంభించాడు. 6 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. షెనాన్ గాబ్రియల్ అందించిన శుభారంభాన్ని అందిపుచ్చుకున్న హోల్డర్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఈ ఇద్దరు తమైదన పేస్‌తో బ్యాట్స్‌మన్‌పై విరుచుకుపడ్డారు.

గాబ్రియేల్ శుభారంభం..
రెండో రోజు ఆట ప్రారంభంలోనే తన ఫామ్‌ను కొనసాగించిన గాబ్రియెల్.. ఇంగ్లండ్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జో డెన్లీ(18) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే నిలకడగా ఆడుతున్న ఓపెనర్ బర్న్స్(30)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి విండీస్‌కు శుభారంభాన్ని అందించాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్ నిదానంగా ఆడారు. దీంతో ఇంగ్లండ్ 62/3తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

స్టోక్స్, బట్లర్ పోరాటం..
ఇక ఈ విరామ అనంతరం జాసన్ హోల్డర్ చెలరేగాడు. క్రాలీ(10)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన విండీస్ కెప్టెన్.. పోప్(12)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ 106/5 స్కోర్‌తో లంచ్ విరామానికి వెళ్లింది. తర్వాత స్టోక్స్, బట్లర్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓపికగా ఆడుతూ మంచి బంతులను బౌండరీలకు తరలించారు. ఇక క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని హోల్డర్ విడదీశాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న స్టోక్స్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో ఆరో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చివర్లో డామ్ బెస్, అండర్సన్..
ఇక జోస్ బట్లర్ కూడా అదే తరహాలో ఔటవ్వడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. జోఫ్రా ఆర్చర్(0), మార్క్ వుడ్ (5) వరుసగా ఔటయ్యారు. చివర్లో డామ్ బెస్(31 నాటౌట్), అండర్సన్(10) బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ 200 మార్క్‌ను ధాటగలిగింది. ఇక గాబ్రియెల్ తనైదన బంతితో అండర్సన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.


Click it and Unblock the Notifications












