తేలిపోయిన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా వెస్టిండీస్

సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ ఆధిపత్యం కొనసాగుతుంది. గురువారం బౌలింగ్‌లో అదరగొట్టిన విండీస్ వీరులు.. శుక్రవారం బ్యాటింగ్‌లోనూ అదరహో అనిపించారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పరుగులు తీయడానికే కష్టపడిన పిచ్‌పై ఓపికగా ఆడుతూ చిన్న చిన్న భాగస్వామ్యాలతో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. క్రాగ్ బ్రాత్‌వైట్(125 బంతుల్లో 65), షేన్ డౌరిచ్(50 బ్యాటింగ్), రోస్టన్ ఛేజ్(47) రాణించడంతో వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 97 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులు చేసింది.
క్రీజులో హాఫ్ సెంచరీ హీరో డౌన్ రిచ్‌తో పాటు అల్జారీ జోసెఫ్(0) ఉన్నారు. ఇప్పటికే విండీస్ 87 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు తీయగా.. డొమినిక్ బెస్, స్టోక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇక 57/1 ఓవర్ నైట్ స్కోర్‌తో శుక్రవారం మూడో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్‌కు బ్రాత్ వైట్, షై హోప్ 59 పరుగులతో భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని అందించారు. షై హోప్(16) ఔటైనా.. బ్రాత్ వైట్ నిదానంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మరికొద్ది సేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు బోల్తా పడి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చినా షమరత్ బ్రూక్స్(39), రోస్టన్ ఛేజ్(47), షెనాన్ డౌరిచ్ రాణించడంతో విండీస్ ఆధిక్యాన్ని అందుకుంది.
Story first published: Friday, July 10, 2020, 22:25 [IST]
Other articles published on Jul 10, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications