England vs Sri Lanka: పాపం శ్రీలంక.. జట్టులో ఇద్దరే బ్యాట్స్‌మెన్.. కొంపముంచిన సీనియర్స్!

డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన ఆ జట్టు.. వన్డే సిరీస్‌లో కూడా క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదాన్ని తెచ్చుకుంది. మూడు వన్డేల సిరీస్ కోసం డర్హమ్‌కు వచ్చిన ఆ జట్టు ఆటగాళ్లు.. అక్కడ ఏర్పాటు చేసిన బయో బబుల్ రూల్స్‌ను అధిగమించారు. దాంతో ఇంగ్లండ్ జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఒకే ఒక బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిస్సంక, కెప్టెన్ పెరీరా మినహా ఎవరూ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కాదు. రూల్స్ అతిక్రమణతో పలువురు బ్యాట్స్‌మన్ సేవలు కోల్పోయిన ఆ జట్టు ఏకంగా ఐదుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కుశాల్ పెరీరా(44 నాటౌట్) పోరాడుతున్నాడు.

సిగరేట్ కోసం వచ్చి..
శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా, ఓపెనర్ దనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన విషయం తెలిసిందే. ముగ్గురు జట్టు బస చేసిన హోటల్ నుంచి వెలుపలికి వచ్చి ఓ స్ట్రీట్‌లో కెమెరాకి చిక్కారు. ఓ వ్యక్తి మొబైల్‌తో తమని వీడియో తీస్తుండటాన్ని గమనించిన డిక్వెల్వా.. కుశాల్‌ని అలెర్ట్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ అప్పటికే సిగరెట్ తాగేందుకు సిద్ధమైన కుశాల్.. ఆలస్యంగా విషయం తెలుసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇరు జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడిన కార్డిఫ్‌లో ఆటగాళ్లను బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. కానీ డర్హమ్‌లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఆటగాళ్లు బయోబబుల్కే పరిమితమవ్వాలని అధికారులు ఆదేశించారు.

ముగ్గురిపై నిషేధం..
ఇక కుశాల్, నిరోషాన్, గుణతిలకలు బయో బబుల్ నిబంధనలను అతిక్రమంచిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు తెలియడంతో వారిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వారిని వన్డే సిరీస్ ఆడేందుకు నిషేధిస్తూ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. దీంతో ఆ జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకుండానే వన్డే సిరీస్ ఆడుతోంది. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై లంక బోర్డు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సీనియర్ల ఆందోళన..
మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు ఇలా విఫలమవుతుండటంపై పలువురు మాజీలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, వెంటనే తగు చర్యలు తీసుకొని జట్టును కాపాడాలని మాజీ కెప్టెన్ సన్‌త్ జయసూర్య ఆదివారం ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, టీమిండియా ఈరోజే శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. అక్కడా జట్టుతో వచ్చేనెల 13 నుంచి మూడు టీ20లు, ఆపై మూడు వన్డేలు ఆడనుంది. మరి గబ్బర్ టీమ్‌తో తలపడేటప్పుడైనా శ్రీలంక పోటీనిస్తుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications