న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: వెంటాడుతున్న వరణుడు.. పాక్-ఇంగ్లండ్‌ తొలి టీ20 రద్దు!

England vs Pakistan: Tom Banton wages lone battle against Pakistan before rain wins
England vs Pak T20 : ICC No Saliva Rule బ్రేక్ చేసిన Pak Bowler || Oneindia Telugu

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌కు అడుగడుగున ఆటంకాలు కలిగించిన వరణుడు.. రెండో టెస్ట్‌ను జరగకుండా చేశాడు. మూడో టెస్ట్‌లో ఫలితం తేలకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా వదలడం లేదు. ఇరు జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16.1 ఓవర్లలో 131/6 స్కోరు చేసింది. ఆ జట్టు టామ్‌ బాంటన్‌ (71) అర్ధ సెంచరీ‌తో మెరుపులు మెరిపించాడు. తర్వాత వర్షం తగ్గినా ఔట్‌ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారడంతో ఆట కొనసాగించే పరిస్థితి లేక.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడే ఆదివారం రెండో టీ20 జరగనుంది.

మ్యాచ్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(2)ను ఇమాద్ వాసిమ్ తొలి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ టామ్ బాంటన్, దావిద్ మలాన్(23) ఆచితూచి ఆడారు. 71 రన్స్ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీ.. సమన్వయ లోపంతో వికెట్ చేజార్చుకుంది. లేని పరుగుకు ప్రయత్నించడంతో దావిద్ మలాన్ రనౌట్‌గా క్రీజును వీడాడు. అనంతర క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్(14)‌తో బాంటన్ చెలరేగాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో బాంటన్ కెరీర్‌లో తొలి టీ20 ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

అయితే ఓ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బాంటన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. మోర్గాన్, మోయిన్ అలీ(8), లూయిస్(2), జోర్డాన్(2) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

దారుణ హత్యకు గురైన సురేశ్ రైనా మామ.. అందుకే ఐపీఎల్‌కు దూరం!దారుణ హత్యకు గురైన సురేశ్ రైనా మామ.. అందుకే ఐపీఎల్‌కు దూరం!

Story first published: Sunday, August 30, 2020, 10:23 [IST]
Other articles published on Aug 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X