ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన అమీర్:
ఇంగ్లడ్‌తో మాంచెస్టర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఐసీసీ కొత్త రూల్స్ బ్రేక్ చేశాడు. బౌలింగ్ చేసే సమయంలో అమీర్ పదేపదే బంతిపై ఉమ్మి రుద్దాడు. బంతి వేసే ముందు అమీర్ ఉమ్మి రుద్దడం వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అమీర్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేస్తూ కనిపించినప్పటికీ ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఎవరైనా ఉమ్మి రాస్తే.. వెంటనే అంపైర్లు టిష్యూతో దాన్ని శుభ్రం చేసి మ్యాచ్‌ని కొనసాగించాలి. కనీసం అది కూడా చేయలేదు అంపైర్లు.

పెనాల్టీ నుంచి తప్పించున్న పాక్:
అలవాటులో పొరపాటుగా ఏ బౌలరైనా బంతిపై ఉమ్మి రుద్దితే.. తొలుత హెచ్చరించాలని అంపైర్లకి ఐసీసీ సూచించింది. ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లుకి మించి అలా రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. ఆ జట్టుకి 5 పరుగులు జరిమానా విధించే అధికారాన్ని కూడా అంపైర్లకి ఐసీసీ ఇచ్చింది. కానీ మహ్మద్ అమీర్ విషయంలో ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దాంతో పాకిస్థాన్ 5 పరుగుల పెనాల్టీ నుంచి తప్పించుకుంది. మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అమీర్.. 14 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు.

టామ్ బాంటన్ హాఫ్ సెంచరీ:
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 16.1 ఓవర్లు ముగిసే సమయానికి 131/6తో నిలిచింది. ఆ జట్టులో ఓపెనర్ టామ్ బాంటన్ (71: 42 బంతుల్లో 4x4, 5x6) హాఫ్ సెంచరీ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (2) నిరాశపరిచాడు. డేవిడ్ మలన్ (23), ఇయాన్ మోర్గాన్ (14), మొయిన్ అలీ (8), లూయిస్ గ్రెగొరీ (2) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
IPL 2020: సీఎస్‌కేలో కరోనా కలకలం.. మరో క్రికెటర్‌కు పాజిటివ్!!


Click it and Unblock the Notifications












