For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11ఏళ్లు.. 3,910 రోజులు.. 88 టెస్ట్‌లు తర్వాత పాక్ జట్టులో చోటు దక్కించుకున్న ఫవాద్ ఆలమ్!

England vs Pakistan: Fawad Alam returns to Pakistan squad after 11 years, missing 88 Tests

సౌతాంప్టన్: పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ 11 ఏళ్ల సుదీర్ఘ విరామం.. 3,910 రోజులు, 88 టెస్ట్‌లు తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌‌తో మళ్లీ జట్టులోకి వచ్చిన ఫవాద్.. చివరిసారిగా 2009‌ నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ మొత్తం 88 మ్యాచ్‌లు ఆడగా.. ఫవాద్‌కు మాత్రం అవకాశం దక్కలేదు. సుదీర్ఘకాలం జట్టుకు దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఫవాద్ ఏడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో పాక్ నుంచి యూనీస్ మహ్మద్(104) ఫవాద్ కన్నా ముందున్నాడు.

ఏడో స్థానంలో..

ఏడో స్థానంలో..

142 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గారెత్ బ్యాటీ అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌కే చెందిన మార్టిన్ బిక్‌నెల్(114), వెస్టిండీస్ క్రికెటర్ ఫ్లైడ్ రీఫర్(109), పాకిస్థాన్ ప్లేయర్ యూనీస్ మహ్మద్(104), ఇంగ్లండ్ ఆటగాళ్లు డెరెక్ షెకెలెటన్(103), లెస్ జాక్సన్(96) ఫవాద్ కన్నా ముందున్నారు. అయితే కరోనాకు ముందు డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించిన ఫవాద్‌ను పీసీబీ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసింది. కానీ తొలి టెస్ట్‌లో మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవడంతో అనుభవజ్ఞుడైన ఫవాద్‌కు అవకాశం ఇవ్వాలని సీనియర్ క్రికెటర్లు సూచించడంతో రెండో టెస్ట్‌లో అవకాశం కల్పించారు.

వికెట్ కోల్పోయిన పాక్..

వికెట్ కోల్పోయిన పాక్..

సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ అజర్ అలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ టెస్ట్ సెంచరీ హీరో షాన్ మసూద్(1) అండర్సన్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆరు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజర్ అలీ(7 బ్యాటింగ్), మరో ఓపెనర్ అబిద్ అలీ(11) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లలో పాక్ వికెట్ నష్టానికి 27 రన్స్ చేసింది.

 స్వల్ప మార్పులు..

స్వల్ప మార్పులు..

ఇక విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన రెండు జట్లు స్పల్ప మార్పులు చేశాయి. వ్యక్తిగత కారణాలతో మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్థానంలో జాక్ క్రాలీ, ఆర్చర్ ప్లేస్‌లో సామ్ కరణ్ జట్టులోకి వచ్చారు. ఇక పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ స్థానంలో ఫవాద్ ఆలమ్ వచ్చాడు. తొలి టెస్ట్‌ గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లండ్ జట్టు ఉంటే.. ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఒత్తిడంతా పాక్‌పై నెలకొంది.

తుది జట్లు:

తుది జట్లు:

ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జోరూట్(కెప్టెన్), జాక్ క్రాలీ, ఒలి పోప్, జోస్ బట్లర్(కీపర్), క్రిస్ వోక్స్, డామ్ బెస్, సామ్ కరన్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్

పాకిస్థాన్: షాన్ మసూద్, అబిద్ అలీ, అజర్ అలీ(కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫవాద్ ఆలమ్, మహ్మద్ రిజ్వాన్(కీపర్), సోహైల్ ఖాన్, యాసిర్ షా, మొహమ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా

Story first published: Thursday, August 13, 2020, 16:49 [IST]
Other articles published on Aug 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+