England vs Pakistan: ఒక్క బంతి పడకుండానే మూడో రోజు ఆట రద్దు!

సౌతాంప్టన్: ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరణుడు వెంటాడుతున్నాడు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు. వరుసగా మూడో రోజు కూడా ప్రభావం చూపాడు. దీంతో శనివారం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఇక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్.. శుక్రవారం బ్యాడ్‌లైట్‌తో ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 రన్స్ చేసిన విషయం తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్(116 బంతుల్లో 5 ఫోర్లతో 60 బ్యాటింగ్) నసీమ్ షా(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బాబర్ ఆజమ్(127 బంతుల్లో 3 ఫోర్లతో 47 హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అండర్సన్, బ్రాడ్ చెరో 3 వికెట్లు తీశారు.
వర్షం కారణంగా తొలి రోజు 45.4 ఓవర్ల ఆటనే సాగగా.. రెండో రోజు మరో 41 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యమైంది. మూడో రోజు మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఆదివారం కూడా మ్యాచ్ ప్రారంభం కావడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో ఈ టెస్ట్ ఫలితం తేలకుండా ముగిసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్ 1-0తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో లీడ్‌లో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications