England vs Pakistan: పాక్ జోరు కొనసాగెనా? ఇంగ్లండ్ బదులిచ్చేనా? డ్రీమ్ 11, తుది జట్లు ఇవే!

లండన్: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కోల్పోయిన పాకిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకొని బదులు తీర్చుకునేందుకు సిద్దమైంది. ఫస్ట్ టీ20లో ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకున్న బాబర్ సేన.. ఆదివారం జరిగే రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు తొలి టీ20లో పోరాడి ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఫస్ట్ టీ20 మాదిరే ఈ మ్యాచ్‌లోనూ హోరాహోరీ పోరు తప్పేలా లేదు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

జోరు మీదున్న పాక్..
వన్డే సిరీస్ వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే సిరీస్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన అతను ఫస్ట్ టీ20లో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. అతనికి తోడుగా మహమ్మద్ రిజ్వాన్ కూడా రాణించాడు. వీరికి అండగా ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణిస్తే ఆ జట్టు బ్యాటింగ్‌కు తిరుగుండదు. షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లతో ఆ టీమ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ఇద్దరు తొలి టీ20లో మూడేసి వికెట్ల సత్తా చాటారు. మిగతా బౌలర్లు కూడా పర్వాలేదనిపించారు. కాబట్టి తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ఇంగ్లండ్ చెలరేగాలి..
పేపర్‌పై ఇంగ్లండ్ టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. ఆటగాళ్ల నిలకడలేమి ఫామ్ ఆందోళన గురిచేస్తోంది. జాసన్ రాయ్ ఫర్వాలేదనిపించినా డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో, మోయిన్ అలీ, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. లియమ్ లివింగ్ స్టోన్ ఫాస్టెస్ట్ సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నాడు. లోయరార్డర్ బ్యాట్స్‌మన్ లూయిస్ గ్రేగరీ, డేవిడ్ విల్లే, టామ్ కరన్ కూడా రాణిస్తే ఇంగ్లండ్‌కు తిరుగుండదు. బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. విల్లే, సకీబ్ మహ్మూద్, టామ్ కరణ్‌లతో పటిష్టంగానే ఉంది. కాలి పిక్క గాయం నుంచి కోలుకున్న జోస్ బట్లర్ తుది జట్టులోకి రానున్నాడు. దాంతో మొయిన్ అలీకి ఉద్వాసన పలకనున్నారు. ఇక తొలి టీ20కి దూరంగా ఉన్న క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ జట్టులోకి రానున్నారు.

తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్(కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, లియమ్ లివింగ్ స్టోన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లూయిస్ గ్రేగరీ, డేవిడ్ విల్లే, టామ్ కరన్/ క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్/ మ్యాట్ పర్కిన్సన్, సకీబ్ మహ్మూద్
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఫకార్ జమాన్, సోహైబ్ మక్సూద్, మహమ్మద్ హఫీజ్, ఆజామ్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్నైన్, షాహిన్ షా అఫ్రిది
డ్రీమ్ ఎలెవన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), జానీబెయిర్ స్టో, జాసన్ రాయ్, బాబర్ అజామ్(కెప్టెన్), లియమ్ లివింగ్ స్టోన్స్(వైస్ కెప్టెన్), ఇమాద్ వసీం, డేవిడ్ విల్లే, సకీబ్ మహ్మూద్, టామ్ కరన్, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications