England vs Pakistan: చెలరేగిన యాసిర్ షా.. ఇంగ్లండ్ ప్యాకప్.. పాక్‌కు భారీ ఆధిక్యం!

మాంచెస్టర్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ బౌలర్ల ధాటికి ఆ జట్టు 219 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా పాక్‌కు 107 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ జట్టులో ఒలిప్ పోప్(62), జోస్ బట్లర్(38) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా మూకుమ్మడిగా చేతులెత్తేసారు. వెస్టిండీస్‌తో మెరిసిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ డకౌట్ కాగా.. కెప్టెన్ జోరూట్(14), ఓపెనర్లు బర్న్స్(4), సిబ్లీ(8) దారుణంగా విఫలమయ్యారు. పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (4/54) వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మహ్మద్ అబ్బాస్, షాదాబ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ షా, నసీమ్ షా, తలో వికెట్ పడగొట్టారు.

ఒలిపోప్ ఒక్కడే..
అంతకు ముందు 92/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు నసీమ్ షా షాకిచ్చాడు. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ ఒలి పోప్(62)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఆ వెంటనే ఆట ప్రారంభం కాగా.. క్రీజులోకి వచ్చిన క్రిస్ వోక్స్.. మరో ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. దీంతో పాక్ 159/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

యాసిర్ షా మాయాజాలం..
ఈ విరామం అనంతరం యాసిర్ షా చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే జోస్ బట్లర్(38) ఔట్ చేసిన అతను ఆ తర్వాత క్రిస్ వోక్స్(19), డామ్ బెస్(1)లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో జోఫ్రా ఆర్చర్(16) కొంచెం ప్రతిఘటించినా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. చివర్లో స్టువర్ట్ బ్రాడ్ (29 నాటౌట్)జేమ్స్ అండర్స్‌న్‌తో కలిసి ధాటిగా ఆడుతూ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ అండర్సన్‌ను షాదాబ్ ఖాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

మసూద్ రికార్డు సెంచరీ
ఇక ఓపెనర్ షాన్ మసూద్ (156; 319 బంతుల్లో 18ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఒకవైపు వికెట్లు పడుతున్నా షాన్ మసూద్ పట్టుదలగా నిలిచాడు. సిసలైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. దుర్భేద్యమైన డిఫెన్స్‌తో బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ఈ ఇన్నింగ్స్‌లో ఆడినన్ని బంతులను ఇంగ్లండ్‌లో గత 24 ఏళ్లలో ఏ పాక్ ఓపెనర్ కూడా ఆడలేదు. నిజానికి మొదటి రోజు కంటే మసూద్ వేగం పెంచాడు. 156 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 251 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత 60 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇంగ్లీష్ పేస్‌ను తట్టుకుని నిలిచి పాక్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అంటే మసూద్ అద్భుత ఇన్నింగ్సే కారణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications