For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

James Anderson ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా అరుదైన ఘనత..

England vs New Zealand: James Anderson Becomes Englands Most-Capped Test Cricketer

బర్మింగ్‌హోమ్: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌తో బర్మింగ్‌హోమ్ వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌తో అండర్సన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ జిమ్మీ కెరీర్‌లో 162వ టెస్ట్ కాగా.. ఇప్పటి వరకు ఆ దేశ మాజీ కెప్టెన్​ అలిస్టర్​ కుక్​(161 మ్యాచ్​లు) పేరిట ఉన్న ఈ రికార్డును ఈ స్టార్ పేసర్ అధిగమించాడు.

2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన అండర్సన్... ఇప్పటివరకు 616వికెట్లు తీశాడు. అందులో 27సార్లు నాలుగు వికెట్ల ఘనతను, 30సార్లు ఐదు వికెట్ల హాల్స్ అందుకున్నాడు. షార్టెస్ట్ ఫార్మాట్‌లో 194 వన్డేలు 19 టీ20లు ఆడిన అండర్సన్.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 269 వికెట్లు, పొట్టి క్రికెట్‌లో 18 వికెట్లు తీశాడు. అండర్సన్ సహచర పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 148 టెస్ట్‌లు ఆడాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోరీ బర్న్స్(81), డామ్ సిబ్లీ(35) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత సిబ్లీని హెన్రీ నికోల్స్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం కివీస్ పేసర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ(0), కెప్టెన్ జోరూట్(4), ఓలీపోప్(19), జేమ్స్ బ్రేసీ(0) విఫలమయ్యారు. హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ రోరీ బర్న్స్‌ను బౌల్ట్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో డాన్ లారెన్స్(26 బ్యాటింగ్), ఓలీ స్టోన్(0 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ రెండేసి వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్, ఆజాజ్ పటేలో తలో వికెట్ తీశారు. తొలి టెస్ట్ డ్రా అయిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, June 10, 2021, 21:30 [IST]
Other articles published on Jun 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+