Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌ నాలుగో టెస్టు: స్మిత్ డబుల్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా భారీ స్కోరు

England vs Australia: A double ton for Steve Smith on return, Australia reached a commanding 497 for 8
Steve Smith named ICC Test player for the year 2017 | Oneindia News

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో సెంచరీ మార్క్‌కు చేరువైన సమయంలో ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడి మైదానం వీడిన స్టీవ్‌ స్మిత్‌.. నాలుగో టెస్టులో తిరిగి తన ప్రతాపం చూపించాడు. మళ్లీ స్మిత్‌ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

ఆరంభంలోనే క్యాచ్‌ మిస్‌:

ఆరంభంలోనే క్యాచ్‌ మిస్‌:

ఓవర్‌నైట్‌ స్కోరు 170/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఇంగ్లీష్ బౌలర్ల నుండి గట్టి పోటీ ఎదురైంది. స్మిత్‌ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 65 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటర్న్‌ క్యాచ్‌ను ఆర్చర్‌ అందుకోలేకపోయాడు. దీంతో స్మిత్ బతికిపోయి రెచ్చిపోయాడు. అయితే హెడ్‌ (19), మాథ్యూ వేడ్‌ (16) ఎక్కువసేపు నిలవలేకపోయినా.. కెప్టెన్ టిమ్‌ పైన్‌తో కలిసి స్మిత్‌ ఇన్నింగ్స్ నిర్మించాడు. 160 బంతుల్లో స్మిత్‌ శతకం పూర్తి చేసిన అనంతరం ఆసీస్ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.

 ఆకట్టుకున్న స్మిత్:

ఆకట్టుకున్న స్మిత్:

రెండో సెషన్‌లో స్మిత్, పైన్ ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంతో ఆసీస్ ఒక్క వికెట్‌ కూడా కోల్పోలేదు. అయితే స్మిత్‌ 118 స్కోరు వద్ద లీచ్‌ నోబాల్‌ వేయడంతో క్యాచ్‌ అవుట్‌ నుంచి బతికిపోయాడు. మరోవైపు 113 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన పైన్‌.. చివరి సెషన్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో ఆరో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ సమయంలో మిచెల్‌ స్టార్క్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో స్మిత్‌ ఒత్తిడి లేకుండా 310 బంతుల్లో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు.

స్టార్క్‌ విజృంభణ:

స్టార్క్‌ విజృంభణ:

అయితే పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌నకు యత్నించి స్మిత్ ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్‌ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా స్టార్క్‌ బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. 49 బంతుల్లోనే వీరు 59 పరుగులు జోడించారు. ఆసీస్‌ చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు చేయడం విశేషం. ఈ సమయంలో కెప్టెన్‌ పైన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు .ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 8 వికెట్లకు 497 పరుగులు చేసింది. బ్రాడ్‌ మూడు.. లీచ్‌, ఒవర్టన్‌ రెండేసి వికెట్లు తీశారు.

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనా విలియమ్స్

474 పరుగులు వెనుకంజలో:

474 పరుగులు వెనుకంజలో:

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ గురువారం రెండో రోజు ఆట ముగిసేసరికి 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది. డెన్లి (4)ని కమ్మిన్స్ అవుట్ చేసాడు. క్రీజులో బర్న్స్‌ (15), ఓవర్టన్‌ (3) ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 474 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో స్మిత్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.

Story first published: Friday, September 6, 2019, 10:09 [IST]
Other articles published on Sep 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+