Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనా విలియమ్స్

US Open 2019: Serena Williams beat Elina Svitolina to reaches US Open final

న్యూయార్క్‌: అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి , దిగ్గజం సెరెనా విలియమ్స్ జోరు కొనసాగుతోంది. యూఎస్‌ ఓపెన్‌-2019లో సెరెనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ స్వితొలినాపై 6-3,6-1 తేడాతో విజయం సాధించింది. స్వితొలినాను వరుస సెట్లలో ఓడించి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోకి వెళ్ళింది. గత ఆరు టోర్నీలలో సెరెనా నాలుగోసారి ఫైనల్ చేరింది.

సెరెనా దూకుడు ముందు స్వితొలినా నిలవలేకపోయింది. సెరెనా మ్యాచ్ ఆరంభం నుండే విరుచుకుపడడంతో స్వితొలినాకు పుంజుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇటీవల జరిగిన వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన సెరెనా.. 2-6, 2-6 తేడాతో టైటిల్‌ను చేజార్చుకుంది. సెరెనా ఇప్పటికే చాలా మంది గొప్ప మహిళా క్రీడాకారిణిల రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఆస్ట్రేలియన్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ ఆల్-టైమ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌పై కన్నేసింది.

ఆరుసార్లు ఛాంపియన్ సెరెనా శనివారం జరిగే ఫైనల్లో స్విస్ బెలిండా బెన్సిచ్‌ లేదా కెనడా భామ బియాంకా ఆండ్రెస్కుతో తలపడనుంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3-6, 6-2, 6-3తో బెల్జియంకు చెందిన ఎలైస్‌ మెర్టెన్స్‌ను ఓడించింది. బెన్సిచ్‌, బెలిండా ఇద్దరు అద్భుతంగా ఆడడంతోసెరీనాకు ఫైనల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Story first published: Friday, September 6, 2019, 8:43 [IST]
Other articles published on Sep 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+