ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్-8 దశను అజేయంగా ముగించింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
విల్ జాక్స్(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు గ్లేన్ ఫిలిప్స్ చెత్త బౌలింగ్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. టీమ్ సీఫెర్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), గ్లేన్ ఫిలిప్స్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), ఫిన్ అలెన్(19 బంతుల్లో 3 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ బాంటన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), హ్యారీ బ్రూక్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), రెహాన్ అహ్మద్(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19 నాటౌట్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర(3/19) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ తీసారు.

లక్ష్య ఛేదనలో చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 43 పరుగులు అవసరమయ్యాయి. పిచ్ స్లోగా ఉండటంతో న్యూజిలాండ్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ గ్లేన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్‌లో రెహాన్ అహ్మాద్ సిక్సర్ బాదగా.. విల్ జాక్స్ 6, 4, 4తో 22 పరుగులు పిండుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రీజులో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండగా ఆఫ్ స్పిన్నర్ అయిన విల్ జాక్స్‌తో బౌలింగ్ చేయించి న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకుంది. ఒకే ఓవర్‌లో 22 పరుగులు రావడంతో ఇంగ్లండ్ ఈజీగా మిగిలిన పరుగులను చేసి విజయాన్నందుకుంది.
ఇంగ్లండ్ విజయంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శ్రీలంకతో శనివారం జరిగే తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తే పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. న్యూజిలాండ్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.