
ఓపెనర్లుగా హసీబ్, రోరీ బర్న్స్
గత రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ డామ్ సిబ్లీ వేటుపడటంతో రోరీ బర్న్స్‌కు జతగా హసీబ్ హమీద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో డేవిడ్ మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ మలాన్... తాజా సీజన్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి 199 పరుగులు చేశాడు.
అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్ స్థానంలో ఉన్న మలాన్.. దూకుడైన బ్యాటింగ్ శైలి జట్టుకు ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. టాప్-3 బ్యాట్స్‌మన్‌లో ఏ ఒక్కరూ చెలరేగినా.. వారి జోరు కొనసాగించేందుకు జోరూట్ సిద్దంగా ఉంటాడని ఆ జట్టు భావిస్తోంది.

రాణించాల్సిందే..
టాప్-4 ఏ ఇద్దరు చెలరేగిన జట్టుకు మంచి స్కోర్ లభిస్తుంది. అప్పుడు మిడిలార్డర్‌లో వచ్చే జానీ బెయిర్ స్టోపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అతను స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా అతనికి జతయితే ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. లోయరార్డర్‌లో మోయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్ ఎలాగు బ్యాట్ ఝులిపించగలరు.
అయితే గత రెండు టెస్ట్‌ల్లో జోరూట్ మినహా ఏవరూ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బెయిర్ స్టో ఓ హాఫ్ సెంచరీతో మెరిసినప్పటికీ ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు. కనీసం మూడో టెస్ట్‌లోనైనా వీరంతా రాణించాల్సి ఉంది.

సకీబ్ అరంగేట్రం..
మూడో టెస్ట్‌కు ప్రకటించిన జట్టులో జాక్ లీచ్ పేరును కూడా ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా అతను జట్టుతోనే ఉండనున్నాడు. సీమర్ సాకిబ్ మహమూద్‌కూ చోటు కల్పించారు. సాకిబ్ మహమూద్ పాకిస్థాన్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో దుమ్మురేపాడు. గత మ్యాచ్‌లో గాయపడ్డ మార్క్ వుడ్ మూడో టెస్ట్ బరిలోకి దిగడం లేదు.
అతని భుజ గాయం తీవ్ర నేపథ్యంలో మూడో టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చాడు. క్రిస్ వోక్స్ కూడి సిద్దంగా లేకపోవడంతో సకీబ్ మహమూద్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. అండర్సన్, సామ్ కరణ్, ఓలీ రాబిన్సన్‌తో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.

ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా)
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జోరూట్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, రోరీ బర్న్స్, సకీబ్ మహమూద్, జేమ్స్ అండర్సన్


Click it and Unblock the Notifications












