న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Euro 2020: 29 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు డెన్మార్క్‌.. ఇటలీ గోల్ ఆనందం!!

Denmark beat Czech Republic to enters Euro 2020 semi-finals after 29 years

మ్యూనిక్‌: యూరో కప్‌ 2020 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డెన్మార్క్‌ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. చెక్‌ రిపబ్లిక్‌తో శనివారం జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌ 2-1 తేడాతో గెలిచింది. చివరిసారి డెన్మార్క్‌ 1992లో సెమీఫైనల్‌ చేరుకోవడమే కాకుండా టైటిల్‌ కూడా సాధించింది. అదే డెన్మార్క్‌ ఖాతాలో ఉన్న ఏకైక టైటిల్‌. డెన్మార్క్‌ జట్టు తరఫున థామస్ డెలానీ (5వ నిముషంలో), కాస్పెర్ డాల్‌బెర్గ్‌ (42వ నిముషంలో) ఒక్కో గోల్‌ చేశారు. చెక్‌ రిపబ్లిక్‌ తరఫున ప్యాట్రిక్‌ షిక్‌ (49వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు.

శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. అయిదో నిమిషంలోనే థామస్ డెలానీ గోల్‌తో డెన్మార్క్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 42వ నిమిషంలో కాస్పెర్ డాల్‌బెర్గ్‌ గోల్‌ చేయడంతో 2-0 ఆధిక్యంతో డెన్మార్క్‌ ప్రథమార్ధాన్ని ముగించింది. అయితే ద్వితీయార్ధం ఆరంభంలోనే ప్యాట్రిక్‌ షిక్‌ గోల్ (49వ నిమిషం) చేయడంతో చెక్‌ రిపబ్లిక్‌ పోటీలోకి వచ్చింది. కానీ స్కోరు సమం చేయడానికి ఆ జట్టు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో డెన్మార్క్‌ విజయాన్ని అందుకుంది.

Wimbledon 2021: ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్‌.. గాఫ్‌, క్రెజికోవా ముందంజ! సానియా జోడీ ఔట్‌!Wimbledon 2021: ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్‌.. గాఫ్‌, క్రెజికోవా ముందంజ! సానియా జోడీ ఔట్‌!

మరో క్వార్టర్స్‌లో ఇటలీ ప్రపంచ నంబర్‌వన్‌ బెల్జియంను ఓడించింది. ఇటలీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. నికోలో (31వ నిమిషం), లారెంజో (44వ నిమిషం) చేసిన గోల్స్‌తో ఇటలీ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బెల్జియం కూడా గట్టిగానే ప్రయత్నించినా.. బంతి కొద్దిలో గోల్‌ పోస్టు తప్పిపోయింది. అయితే ప్రధమార్థం ముగుస్తుందగా.. బెల్జియంకు పెనాల్టీ కిక్‌ లభించింది. దీన్ని సద్వినియోగం చేస్తూ లుకాకు 47వ నిమిషంలో గోల్‌ చేసి బెల్జియం ఖాతా తెరిచాడు. కానీ బెల్జియం చివరి వరకు స్కోరు సమం చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. బుధవారం జరిగే సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఇటలీ అమీతుమీ తేల్చుకోనుంది.

సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన మ‌రో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్పెయిన్ 3-1 తేడా గోల్స్‌తో స్విట్జ‌ర్లాండ్‌పై గెలుపొందింది. తొలుత రెండు జ‌ట్లు 1-1 గోల్స్ తో స‌మంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ త‌న స‌త్తా చాటింది. స్విజ్ జ‌ట్టు దాదాపు 45 నిమిషాల పాటు కేవ‌లం ప‌ది మంది ఆట‌గాళ్ల‌తో మ్యాచ్ ఆడింది. కానీ పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ గోల్‌కీప‌ర్ సైమ‌న్ రెండు గోల్స్‌ను సేవ్ చేశాడు.

Story first published: Sunday, July 4, 2021, 9:57 [IST]
Other articles published on Jul 4, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X