Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 60 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసింది. ఈ క్రమంలో 60 ఏళ్ల రికార్డ్‌ను ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ను 358 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లండ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపింది.

బాజ్ బాల్ బ్యాటింగ్‌తో ఓపెనర్లు జాక్ క్రాలీ(84), బెన్ డకెట్(94) అదిరిపోయే ఆరంభాన్ని అందించంగా.. ఓలీ పోప్(71), జో రూట్(150) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారీ స్కోర్‌కు బాటలు వేసారు. కెప్టెన్ బెన్స్ స్టోక్స్ భారీ శతకంతో ఇంగ్లండ్‌కు రికార్డ్ స్కోర్ అందించాడు.

England Makes History at Old Trafford with Record 669-Run Total Against India in 4th Test

ఈ భారీ స్కోర్‌తో ఇంగ్లండ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. 1964లో ఆస్ట్రేలియా 656/8 భారీ స్కోర్ చేయగా..60 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ 669 పరుగులతో ఈ రికార్డ్‌ను అధిగమించింది. భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్. 2011లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 710/7 భారీ స్కోర్ చేసింది.

11 ఏళ్ల తర్వాత భారత్ 600 ప్లస్ స్కోర్ సమర్పించుకుంది. చివరిసారిగా భారత్ 2014లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 600 ప్లస్ రన్స్ సమర్పించుకుంది.

టెస్ట్ క్రికెట్‌‌లో ఓ ఇన్నింగ్స్‌లో 300 ప్లస్ ఆధిక్యం సాధించడం ఇది ఏడోసారి మాత్రమే. ఇంగ్లండ్‌ తొలిసారి ఈ ఫీట్ సాధించడం విశేషం.

Story first published: Saturday, July 26, 2025, 20:00 [IST]
Other articles published on Jul 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+