Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Playing XI: బెన్ స్టోక్స్ ఔట్.. భారత్‌తో ఆఖరి టెస్ట్‌కు నాలుగు మార్పులతో ఇంగ్లండ్!

భారత్‌తో ఆఖరి టెస్ట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. కుడి భుజ గాయంతో బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పేర్కొంది. గురువారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన తుది జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. తుది జట్టులో మొత్తం నాలుగు మార్పులు చేసింది.

కెప్టెన్ బెన్ స్టోక్స్ గైర్హాజరీలో జట్టును ఓలీ పోప్ నడిపిస్తాడని తెలిపింది. బెన్ స్టోక్స్ స్థానంలో జాకోబ్ బెతెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. లియామ్ డాసన్‌తో పాటు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌లపై వేటు వేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వారి స్థానాల్లో గస్ అట్కిన్సన్, జెమీ ఓవర్టన్, జోష్ టంగ్‌లను ఎంపిక చేసింది.

England Make 4 Changes In Playing XI For 5th Test VS India Ben Stokes Out and Jacob Bethell In

గతేడాది తన అరంగేట్ర న్యూజిలాండ్ పర్యటనలో జాకోబ్ బెతెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జట్టులో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్‌ లేకుండా ఇంగ్లండ్ బరిలోకి దిగడం గమనార్హం. గత మ్యాచ్ ఆడిన లియామ్ డాసన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతనిపై వేటు పడింది. మరోవైపు భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

బెన్ స్టోక్స్ గైర్హాజరీ ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు. ఈ సిరీస్‌లో బెన్ స్టోక్స్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 4 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్‌ల్లో 43.42 సగటుతో 304 పరుగులు చేసిన బెన్ స్టోక్స్.. 25.23 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. నాలుగో టెస్ట్‌లో ఒక సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఐదో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, జెమీ స్మిత్(కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జెమీ ఓవర్టన్, జోష్ టంగ్.

Story first published: Wednesday, July 30, 2025, 16:51 [IST]
Other articles published on Jul 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+