Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్లకు నో చాన్స్!

England IPL players likely to miss two- Test series against New Zealand

లండన్: ఐపీఎల్‌2021 సీజన్‌లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్న ప్లేయర్లకు రెడ్ బాల్ ప్రాక్టీస్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతో జోస్ బట్లర్‌, బెయిర్‌స్టో, సామ్‌ కరన్, క్రిస్‌ వోక్స్‌, మొయిన్ ‌అలీ న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

పెడ్యూల్ ప్రకారం జూన 2న తొలిటెస్టు లార్డ్స్‌లో జరుగుతుంది. దీంతో కేవలం రెండు వారాల సమయం ముందే వీరి క్వారంటైన గడువు ముగియనుంది. అయితే ఇంత తక్కువ సమయంలో వీరు టెస్టు సిరీస్‌కు సిద్ధం కాలేరని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఒల్లీ రాబిన్సన్, ఓవర్టన్, బ్రాసేలను ఆడించే చాన్సుంది.

'ఈ వీకెండ్‌తో ఐసోలేషన్ పీరియడ్ ముగిస్తుంది. లార్డ్స్‌లో ఫస్ట్ టెస్ట్‌కు ఇంకా రెండు వారాల టైమ్ ఉంది. కానీ ఆలోగా క్రికెటర్లు ప్రాక్టీస్‌లోకి దిగడం కష్టమే. ప్రాక్టీస్ లేకపోవడంతో ఫిట్‌నెస్ సమస్యలు వస్తాయి. కౌంటీ చాంపియన్‌షిప్‌లో కొద్ది రోజులు గడిపితే మళ్లీ గాడిలో పడతారు. అప్పటివరకు రాచిన్సన్, ఓవర్టన్, జేమ్స్ బ్రాసీని టీమ్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం'అని ఈసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

మరోవైపు కివీస్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ బ్రేక్ తీసుకోనున్నాడు. శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగే హో‌మ్ సిరీస్‌లకు తన అసిస్టెంట్స్ పాల్ కాలింగ్ వుడ్, గ్రాహం థోర్ఫ్‌లకు పగ్గాలు అప్పగించనున్నాడు.

Story first published: Sunday, May 16, 2021, 10:09 [IST]
Other articles published on May 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+