For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్!

England hits ODI world-record for highest total with 498 against Netherlands

ఆమ్‌స్టెల్విన్: మూడు సెంచరీలు.. 26 సిక్సర్లు, 36 ఫోర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్.. పసికూన నెదర్లాండ్స్‌పై వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ సృష్టించిన పరుగుల విధ్వంసమిది. ఈ దెబ్బకు అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లండ్ తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో అసాధ్యం అనుకుంటున్న 500 రన్స్ మైలురాయికి ఆ జట్టు కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. నెదర్లాండ్స్ టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓ రేంజ్‌లో విజృంభించి పరుగుల మోత మోగించింది.

లివింగ్ స్టోన్ విధ్వంసం...

లివింగ్ స్టోన్ విధ్వంసం...

50 ఓవర్లలో 498/4 స్కోర్ చేసిన ఇంగ్లీష్ టీమ్.. 2018లో ఆస్ట్రేలియాపై 481/6తో నెలకొల్పిన వరల్డ్ రికార్డును అధిగమించింది. ఐపీఎల్‌లో ఇరగదీసిన జోస్ బట్లర్(70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 నాటౌట్)కు తోడు డేవిడ్ మలన్(109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), ఫిల్ సాల్ట్(93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 122) సెంచరీలు బాదగా.. లివింగ్ స్టోన్(22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్) ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 వద్ద ఆలౌటై.. 232 రన్స్ తేడాతో ఓడిపోయింది. బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

60 బంతుల్లో 164

మొదటి 250 రన్స్ చేసేందుకు 2022 బాల్స్ ఆడిన ఇంగ్లండ్.. బట్లర్, లివింగ్ స్టోన్ దెబ్బకు మరో 98 బంతుల్లో 248 పరుగులు చేసింది. ఆఖరి పది ఓవర్లలో 164 రన్స్ వచ్చాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ జేసన్ రాయ్(1) ఔటవ్వగా.. సాల్ట్, మలన్ 28 ఓవర్లకు స్కోర్ 200 ధాటించారు. 30వ ఓవర్లలో సాల్ట్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ కూడా తొలి 16 బంతుల్లో 17 రన్స్ చేయగా.. 34 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 250 మార్క్ ధాటింది. కానీ 35వ ఓవర్లో మూడు సిక్సర్లతో బట్లర్ బాదుడు షురూ అయింది.

లాలిపాప్ క్యాచ్ వదిలేయడంతో..

లాలిపాప్ క్యాచ్ వదిలేయడంతో..

అదే ఓవర్లో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను నదీమ్ ముసా వదిలేయడంతో వరల్డ్ రికార్డుకు పునాది అయింది. ఈ లైఫ్‌తో ఓ రేంజ్‌లో చెలరేగిన జోస్.. 47 బంతుల్లో నే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదు ఓవర్లు మిగిలుండగానే క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టో 46వ ఓవర్లలో 4,6, 6, 4, 6 ఐదు బౌండరీలతో 32 రన్స్ పిండుకున్నాడు.

48 ఓవర్లకు 470/4తో నిలిచిన ఇంగ్లండ్ సునాయసంగా 500 మార్క్ ధాటేలా కనిపించింది. కానీ.. 49వ ఓవర్‌లో 7 రన్సే వచ్చాయి. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లు రాబడితే 500 ఊరిస్తుండగా.. లివింగ్ స్టోన్ 4, 6 కొట్టాడు. దాంతో మ్యాజిక్ మార్క్‌కు ఇంగ్లండ్ 2 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ సిరీస్‌లో ఆది, బుధవారాల్లో నెదర్లాండ్స్‌తో ఇంగ్లండ్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Story first published: Saturday, June 18, 2022, 11:33 [IST]
Other articles published on Jun 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+