Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: ఇంగ్లండ్‌కు అగ్ని పరీక్ష.. ఓడితే ఇంటికే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ కీలక పోరుకు సిద్దమైంది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం లాహోర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు అఫ్గానిస్థాన్ పరిస్థితి కూడా అదే. సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-2లో కొనసాగుతున్నాయి.

England will take on Afghanistan in a must-win game at Lahore s Gaddafi Stadium on Wednesday

కలవరపెడుతున్న బౌలింగ్..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 352 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసినా విజయం సాధించలేకపోయింది. డ్యూ రావడంతో ఆసీస్‌కు ఛేజింగ్‌ ఈజీ అయ్యింది. ఈ క్రమంలోనే అఫ్గాన్‌పై విజయం సాధించి సెమీస్ రేసులో నిలవాలంటే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు ఎదురు దెబ్బే. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు.

బెన్ డకెట్, జోరూట్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్ కూడా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. అయితే బౌలింగ్ విభాగం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. ఆసీస్‌తో 352 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కాపాడుకోలేకపోయింది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌ రాణిస్తేనే ఆ జట్టుకు విజయాలు దక్కనున్నాయి.

తక్కువ అంచనా వేస్తే..
అఫ్గాన్ టీమ్ బలంగా లేకున్నా.. ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంటుంది. టీ20 ప్రపంచకప్ 2024లో ఆసీస్‌ను ఓడించి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా.. బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉంది. ఏది ఏమైనా ఇంగ్లండ్‌కు అఫ్గాన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

తుది జట్లు(అంచనా)

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

అఫ్గాన్: రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూ.

Story first published: Tuesday, February 25, 2025, 17:46 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+