న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోరూట్‌‌కు అమ్మాయి.. అప్పుడే ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్‌ లక్ చెప్పింది!

England Captain Joe Root Shares Picture With Newborn Daughter

లండన్: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌కు పాప పుట్టింది. ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్‌ వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.

'ఇంగ్లండ్‌ జట్టుకు బెస్టాఫ్‌ లక్‌. మేం మ్యాచ్‌ చూస్తూ మీకు మద్దతునిస్తాం' అంటూ కొత్తగా పుట్టిన అమ్మాయి ఇసాబెల్లా, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్‌ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్‌ చేశాడు. దీంతో అప్పుడే పుట్టిన పాప కూడా ఇంగ్లండ్ జట్టుకు విషెస్ చెబుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

విరామం అనంతరం రూట్‌ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్‌ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్‌ నిలిచాడు.

దాదాపు మూడునెలలు.. 117 రోజుల నీరిక్షణ తర్వాత ఎన్నో అంచనాలు.. మరెన్నో భావోద్వేగాల మధ్య బుధవారం ప్రారంభమైన ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌ను వరణుడే ఆడుకున్నాడు. తొలి రోజు ఆటకు పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు.

వర్షంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ (55 బంతుల్లో 20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది.

ఎవడ్రా అక్కడ మ్యాచ్ పెట్టింది.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌పై పేలుతున్నజోకులు, మీమ్స్.!ఎవడ్రా అక్కడ మ్యాచ్ పెట్టింది.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌పై పేలుతున్నజోకులు, మీమ్స్.!

Story first published: Thursday, July 9, 2020, 14:01 [IST]
Other articles published on Jul 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X