వారెవ్వా ఫ్లెమింగ్ వాటే ఛాన్స్.. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు..!
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు జాక్‌పాట్ తగిలింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. ఏకంగా ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ పదవి వరించింది. 18 ఏళ్ల తర్వాత ఫ్లెమింగ్‌పై సీఎస్‌కే వేటు వేగయా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. హెడ్ కోచ్‌గా స్వాగతం పలికింది. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ సారథిగా తిరిగి జోరూట్‌ను ఎంపిక చేసింది.
బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికడంతో అనుభవం కలిగిన జోరూట్‌కే
ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మళ్లీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. బ్రెండన్ మెక్‌కల్లమ్ స్థానంలో స్టీఫెన్ ఫ్లేమింగ్‌ను టెస్ట్ టీమ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు ఈసీబీ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఏకగ్రీవంగా ఆమోదం..
స్టీఫెన్ ఫ్లెమింగ్ నియామకాన్ని ఈసీబీ బోర్డు ప్యానెల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన కోచ్‌ల్లో ఒకరైన ఫ్లెమింగ్ రాకతో టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఒక కొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఫ్లెమింగ్ తెలిపాడు. 'టెస్ట్ కోచ్‌గా ఇంగ్లండ్ జట్టులో చేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కోచింగ్ పదవుల్లో ఇది ఒకటి. అలాంటి పదవి బాధ్యతలను చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా.
ఆటగాళ్లతో పని చేయడానికి, బ్రెండన్ మెక్‌కల్లమ్, బెన్ స్టోక్స్ సాధించిన ప్రగతిని కొనసాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలతో జట్టుకు విజయాలను అందించే ప్రయత్నం చేస్తాం. జట్టులోని యువ ప్రతిభావంతులకు సాయం చేయడమే మా ప్రధాన లక్ష్యం.'అని ఫ్లేమింగ్ చెప్పుకొచ్చాడు.
కోచ్‌గా సూపర్ రికార్డ్..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా 18 ఏళ్ల సేవలందించాడు. ఈ 18 సంవత్సరాల్లో 10 సార్లు జట్టును ఫైనల్‌కు చేర్చడంతో పాటు ఐదు టైటిళ్లు అందించాడు. సీఎస్‌కేకు చెందిన ఇతర గ్లోబల్ ఫ్రాంచైజీలకు కూడా కోచ్‌గా సేవలందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్‌గా 80 మ్యాచ్‌ల్లో 28 విజయాలు అందించాడు. కౌంటీ క్రికెట్‌లో నాటింగమ్‌షైర్ జట్టుకు సారథిగా వ్యవహరించి 2005 కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిల్ అందించాడు.
2017 నుంచి 2022 వరకు కెప్టెన్‌గా కొనసాగిన జోరూట్ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. గతంలో 64 టెస్ట్‌ల్లో జోరూట్ 27 విజయాలు అందించాడు. ఇంగ్లండ్ సారథ్య బాధ్యతలను తిరిగి చేపట్టడం గర్వంగా ఉందని జోరూట్ తెలిపాడు. ఈ బాధ్యతల్లో కొనసాగడం ఎంతో కష్టమైనప్పటికీ.. సంతృప్తినిస్తోందని చెప్పాడు. స్టీఫెన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

