Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన స్టోక్స్.. 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ క్రికెటర్‌గా అరుదైన ఘనత!

England all-rounder Ben Stokes becomes no.1 Test all-rounder, moves to 3rd spot in batsmen rankings

దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దుమ్ములేపాడు. కరోనా అనంతరం ప్రారంభమైన ఆటలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న స్టోక్స్.. టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్ర స్థానాన్ని, బ్యాటింగ్ లిస్ట్‌లో టాప్-3 ర్యాంక్‌ను అందుకున్నాడు. వెస్టిండీస్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో అద్భుత బ్యాటింగ్.. సూపర్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 ఆల్‌రౌండ్ షో..

ఆల్‌రౌండ్ షో..

తొలి ఇన్నింగ్స్‌లో 176 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌‌లో 57 బంతుల్లోనే 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య ఇంగ్లండ్ 113 పరుగులతో గెలుపొంది మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమం చేసింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన బెన్‌ స్టోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో స్టోక్స్‌(497 పాయింట్లు) ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లాడు.

హోల్డర్‌ను వెనక్కు నెట్టి..

హోల్డర్‌ను వెనక్కు నెట్టి..

వెస్టిండీస్ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌(459 పాయింట్లు)ను వెనక్కు నెట్టి మరీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రెండో టెస్ట్‌కు ముందు హోల్డర్ కన్నా 54 పాయింట్లు వెనుకంజలో ఉన్న స్టోక్స్.. ప్రస్తుతం 38 పాయింట్ల ఆధిక్యంతో టాప్‌లో నిలిచాడు. ఫలితంగా 14 ఏళ్ల తర్వా ఈ ఘనతను అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా స్టోక్స్ నిలిచాడు. ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో చివరిసారిగా 2006లో ఆండ్రూ ప్లింటాఫ్‌ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(397) మూడో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్(298), భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ 4,5 స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ తర్వాత..

కోహ్లీ తర్వాత..

ఇక బ్యాటింగ్ లిస్ట్‌లో స్టోక్స్ మూడో ర్యాంక్‌కు దూసుకెళ్లగా.. మాంచెస్టర్ టెస్ట్‌లో(23, 22) విఫలమైన జోరూట్ 9 ర్యాంక్‌కు పడిపోయాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(911), భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(886) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. 827 రేటింగ్ పాయింట్లతో బెన్ స్టోక్స్ మూడో స్థానంలో నిలిచాడు. స్టోక్స్ ధాటికి మార్నస్ లబుషెన్, కేన్ విలియమ్సన్ ఒక స్థానాన్ని దిగజారారు. వెస్టిండీస్ తరఫున పోరాడిన బ్రూక్స్(68, 62) 27 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్ అందుకున్నాడు.

 టాప్-10లో బ్రాడ్..

టాప్-10లో బ్రాడ్..

ఇక రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇక జేమ్స్ అండర్సన్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌లో ప్యాట్ కమిన్స్ ఉండగా.. జాసన్ హోల్డర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇకక భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఏడో ర్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు. రెండో టెస్ట్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. స్టోక్స్ 176 పరుగులతో రాణించగా.. డామ్ సిబ్లీ(120) శతకం బాదాడు. అనంతరం వెస్టిండీస్ 287 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్ వైట్(75), బ్రూక్స్ (68), చేజ్(51) ఆదుకున్నారు. అనూహ్యంగా స్టువర్ట్ బ్రాడ్(3/66) చెలరేగి విండీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. స్టోక్స్(78 నాటౌట్) ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్‌తో 129/3 పరుగుల వద్ద డిక్లెర్ చేసి ప్రత్యర్థి ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం విండీస్ 198 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.

Story first published: Tuesday, July 21, 2020, 16:14 [IST]
Other articles published on Jul 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+