Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు భారీ లోటు!

భారత్‌తో నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోర్‌కు ఆలౌటైంది. 544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో ఈ మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. దాంతో డ్రా చేసుకోవడం మినహా భారత జట్టుకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.

నాలుగో రోజు ఆటలోనూ ఇంగ్లండ్ తమ జోరును కొనసాగించింది. లియామ్ డాసన్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చినా.. బ్రైడన్ కార్స్‌తో కలిసి బెన్ స్టోక్స్ చెలరేగాడు. సిరాజ్ వేసిన 146వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించిన స్టోక్స్.. 164 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. స్టోక్స్‌ కెరీర్‌లో ఇది 14వ టెస్ట్ శతకం. ఈ సెంచరీతో స్టోక్స్ పలు రికార్డు‌లను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు సెంచరీ బాదిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్‌గా నిలిచాడు. శతకం అనంతరం దూకుడుగా ఆడిన స్టోక్స్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ బాది టెస్ట్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

England 669 All Out Securing Mammoth 311-Run Lead Against India in Manchester Test

భారత బౌలర్ల సహనానికి పరీక్షగా మారిన ఈ జోడీని జడేజా విడదీసాడు. బెన్ స్టోక్స్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 9వ వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి వికెట్‌గా బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేసిన జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే టీమిండియా ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకు బ్యాటింగ్ చేయాలి.

Story first published: Saturday, July 26, 2025, 17:37 [IST]
Other articles published on Jul 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+