For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs WI: బెన్ స్టోక్స్ టీ20 బ్యాటింగ్.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ విధించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 7.2 ఓవర్లలోనే చేధించింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్) టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగి ఇంగ్లండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మరో ఓపెనర్ బెన్ డక్కెట్(16 బంతుల్లో 4 ఫోర్లతో 25 నాటౌట్) కూడా వేగంగా పరుగులు చేశాడు.

ENG vs WI England beat West Indies by 10 wickets to win 3rd Test and Secure 3-0 Series win

అంతకుముందు 33/2 ఓవర్‌ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. మైకిల్ లూయిస్(95 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), కెవెమ్ హోడ్జ్(76 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(5/40) ఐదు వికెట్లతో చెలరేగగా.. గస్ అట్కిన్సన్(2/28) రెండు వికెట్లు తీసాడు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 75.1 ఓవర్లలో 282 పరుగులకు కుప్పకూలింది.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 75.4 ఓవర్లలో 376 పరుగులు చేసింది. బజ్ బాల్ బ్యాటింగ్‌తో వేగంగా ఆడిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఇంగ్లండ్.. సునాయస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్ రెండున్నర రోజుల్లోనే ఫలితాన్ని అందుకుంది.

Story first published: Sunday, July 28, 2024, 22:36 [IST]
Other articles published on Jul 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+